ఆమెకు హీరోయిన్గా ఇదే తొలి సినిమా తొలి సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో సదాకు వరుస పెట్టి చాలా సినిమాలలో అవకాశాలు వచ్చాయి .. తెలుగుతో పాటు తమిళం లోనూ స్టార్ హీరోల సినిమాలలో ఆమె నటించింది .. సదా ఖచ్చితంగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు .. అయితే ఆమె స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదగలేకపోయింది .. దీనికి ప్రధాన కారణం అపరిచితుడు సినిమా అని చెప్పాలి .. ఈ సినిమాలో విక్రమ్ హీరో దర్శకుడు శంకర్ సాధారణంగా శంకర్ సినిమాలలో ఒక హీరోయిన్ నటిస్తోంది .. అంటే చాలు ఆ సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమాకు డేట్లు ఇవ్వడం కుదరదు అన్న కండిషన్లో ఉండేవి .. అయితే సదా, శంకర్ సినిమా అవకాశం వచ్చింది అనగానే ఆ సినిమా పూర్తయ్యే వరకు మరే సినిమా చేయను అన్న కండిషన్తో డేట్లు ఇచ్చేసింది ..
అపరిచితుడు సినిమా షూటింగ్ ఏకంగా రెండు సంవత్సరాల పాటు కొనసాగింది .. ఆ టైంలో సదా మరే సినిమా చేయలేదు .. ఇలాగ టాలీవుడ్ లో ఇతర హీరోయిన్లు దూసుకు వచ్చేశారు .. అపరిచితుడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయినా ఆ సినిమా కోసం ఆమె ఎన్నో మంచి అవకాశాలు వదులుకోవాల్సి వచ్చింది .. ఒకవేళ సదా అపరిచితుడు సినిమాతో పాటు అప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించి ఉంటే ఆమె కచ్చితంగా కొన్నేళ్లపాటు ఒక వెలుగు వెలిగి ఉండేది .. కానీ శంకర్ ఆమె కెరీర్ ను ఇలా దెబ్బ పెడతారని ఎవరు ఊహించలేదు ..