టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించారు .. గత ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం లాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు యావరేజ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు .. ప్రస్తుతం మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్నా. పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే .. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లో 29 వ సినిమాగా తెరకెక్కుతోంది .. అలాగే మహేష్ బాబు , రాజమౌళి కెరియర్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావటం విశేషం ..


ఇక ఇది ఇలా ఉంటే మహేష్ బాబు కెరీర్ లో ఎన్నో ప్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి .. బ్రహ్మోత్సవం , వన్ , స్పైడర్ లాంటి డిజాస్టర్ సినిమాలు మహేష్ బాబు కెరీర్ లో ఇటీవల కాలంలో వచ్చాయి .. బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్ కావడం తో పాటు మహేష్ బాబు పరువు మొత్తం తీసేసింది .. వాస్తవానికి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల మీద మహేష్ బాబుకు మంచి నమ్మకం ఏర్పడింది .. ఈ క్రమంలోనే శ్రీమంతుడు సినిమా షూటింగ్ క్లైమాక్స్ జరుగుతూ ఉండగా శ్రీకాంత్ అడ్డాల వచ్చి మంచి ఫ్యామిలీ స్టోరీ అని కథ చెప్పబోతూ ఉండగా శ్రీకాంత్ పై నమ్మకం తో మహేష్ వెంటనే ఓకే చెప్పేసారట ..


అయితే అప్పటికి కథ ఇంకా పూర్తి కాలేదు. పూర్తి స్క్రిప్ట్ రెడీ కాకుండా సినిమా సెట్స్ మీదకు వెళ్ళిపోయింది .. సగం సినిమా షూటింగ్ పూర్తయ్యాక కానీ మహేష్ బాబుకు కథ‌ పూర్తిగా రెడీ కాలేదు అన్న విషయం తెలిసిందిట అప్పటికే త‌న చేయి దాటిపోయింది చేయటానికి ఏం లేదు అలా ఆ సినిమా డిజాస్టర్ అవుతుందని మహేష్ బాబుకి ముందే తెలిసిపోయింది .. మహేష్ బాబు , శ్రీకాంత్ అడ్డాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సినిమా డిజాస్టర్ కావడంతో పాటు మహేష్ బాబు పరువు తీసేసింది

మరింత సమాచారం తెలుసుకోండి: