బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రీతి జింటా ఈ సినిమాలో మహేష్ బాబు కు జోడి గా నటించింది .. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అగ్ర నిర్మాత చలసాని అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా .. మణిశర్మ స్వరాలు అందించారు .. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడం తో పాటు ఆరోజుల్లోనే 45 కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకుంది .. కొన్ని కేంద్రాలలో 175 రోజుల తో పాటు మరికొన్ని కేంద్రాలలో 200 రోజులు కూడా పూర్తి చేసుకుంది ..
ఈ సినిమా షూటింగ్లో ఒక సన్నివేశం లో హీరోయిన్ తాగిన కూల్డ్రింక్ ను హీరో మహేష్ బాబు తాగాల్సి ఉంటుంది .. అయితే మహేష్ ఆ సీన్ చేయాలని రాఘవేంద్రరావు ఎంత పట్టు పట్టిన నేను మాత్రం అలా చేయను కావాలంటే నువ్వే తాగు మామయ్య అని రాఘవేంద్రరావు పై కసురుకుని బయట కు వెళ్లిపోయాడట ... ఇక చివరకు మహేష్ కన్విన్స్ అయ్యి మరో డ్రింక్ తాగి ఆ సీన్ ను పూర్తి చేశాడట .. తను రాఘవేంద్రరావుని చిన్నప్పటి నుంచి మావయ్య అని పిలవటం అలవాటు అని మహేష్ ఓ సందర్భంలో చెప్పారు ..