టాలీవుడ్ హీరో నటసింహా బాలకృష్ణ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడంతో అభిమానులే కాకుండా సిని సెలెబ్రిటీలు కూడా ఆనందపడుతున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలయ్య ఈ అవార్డు రావడం ప్రత్యేకమని కూడా చెప్పవచ్చు. అయితే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న క్షణం వచ్చింది అని బాలయ్య కన్న కల నిజమయిందనే విధంగా అభిమానులు తెలియజేస్తున్నారు. ఈ అవార్డు రావడంతో బాలయ్య అభిమానులు కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉండగా ఈ సమయంలోనే సినీ సెలబ్రెటీలు సోషల్ మీడియాలో బాలయ్య అందించిన సేవలకు పద్మభూషణ్ పురస్కారం నిదర్శనం అంటూ తెలియజేస్తున్నారట.


తాజాగా ఇండస్ట్రీ తరఫున బాలయ్యకు ఒక భారీ సన్మానం చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకు గాను ఒక ఈవెంట్ ని కూడా ప్లాన్ చేస్తున్నారట. అయితే సన్మాన సభకు సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయని టాక్ వినిపిస్తూ ఉన్నది. మరి కొద్ది రోజులలో తేదీతో పాటు వేదికను కూడా ఖరారు చేయబోతున్నట్లు వార్తలు కనిపిస్తున్నాయి. గతంలో కూడా బాలయ్య స్వర్ణోత్సవం కూడా నోవాటెల్ ఆడిటోరియంలో పూర్తి చేయడం జరిగింది.


ఆ వేడుకలకు నందమూరి కుటుంబ సభ్యులతో పాటు చిరంజీవి తదితర నటీనటులు కూడా హాజరు అయ్యారు. ఇప్పుడు మరొకసారి పద్మభూషణ్ అవార్డు అందుకున్న బాలయ్యను ఘనంగా సన్మానించడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తాందట. మరి ఈసారి ఎవరెవరిని పిలుస్తారో చూడాలి. బాలయ్య మొదటిసారి తాతమ్మ కల అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. చైల్డ్ యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మారి ఎన్నో విజయాలను అందుకున్నారు. ఇప్పటికీ సీనియర్ హీరోలను ఎక్కువగా సక్సెస్ రేటు ఉన్న హీరోగా పేరు సంపాదించారు బాలయ్య. మరి ఇదే సక్సెస్ ఇలాగే కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: