తెలుగు చిత్రసీమలో బాలకృష్ణ  తన 50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని దిగ్విజయంగా పూర్తిచేసుకున్నారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తనయుడిగా వెండితెరపై అడుగు పెట్టారు. తన 14 ఏళ్ల వయసులో 'తాతమ్మ కల' సినిమాలో నటించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఆయనకు రాలేదు. తెలుగు ప్రజల ప్రేమ అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. గత కొన్నాళ్లుగా బాలయ్య ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అఖండ సినిమా నుంచి వరుసగా హిట్స్ కొడుతున్నారు. మరో వైపు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంకోవైపు అన్‌స్టాపబుల్ లో హోస్ట్ గా అలరిస్తున్నారు. ఇదిలావుండగా బాలయ్య తన కెరీర్‌లో ఎన్ని సినిమాలలో నటించినా రెండు సినిమాల షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన చాలా ఎంజాయ్ చేస్తూ నటించారు. అందులో ఒకటి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పైసా వసూల్. ఈ సినిమాలో పూరి.. బాలయ్యను అప్పటివరకు ఎవరు చూపించని సరికొత్త కోణంలో ప్రజెంట్ చేశారు.

బాలయ్య ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న అన్ని రోజులు చాలా ఎంజాయ్ చేస్తూ చేశారట. అలాగే వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో 2002లో వచ్చిన చెన్నకేశవరెడ్డి సినిమా షూటింగ్ జరుగుతున్నంతసేపు కూడా బాలయ్య ఎంజాయ్ చేశారట. మరి ముఖ్యంగా తండ్రి పాత్రలో లీనమై ఇంటికి వెళ్ళాక కూడా అదే పాత్ర గురించి ఆలోచించేవాడిని అని బాలయ్య పలు సందర్భాలలో చెప్పారు.ఇదిలావుండగా గతంలో ఎన్టీఆర్ కు పద్మశ్రీ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రిపబ్లిక్‌ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమా రంగానికి చెందిన ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రకటించారు. అందులో భాగంగా బాలకృష్ణకి పద్మ భూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించారు.
బాలకృష్ణకి పద్మ అవార్డు ప్రకటించడంతో సినిమా ప్రముఖులు స్పందిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.ఇప్పుడు బాలయ్యకు కూడా పద్మ భూషణ్ రావడంతో అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: