ఈ బ్యూటీ నటనకు విపరీతంగా క్రేజ్ వచ్చింది. ఆ సినిమా అనంతరం కొన్ని సినిమాలలో నటించిన ఈ చిన్నది ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేక సతమతమవుతోంది. ప్రస్తుతం పూజ హెగ్డే బాలీవుడ్ సినిమాలలో నటిస్తోంది. అక్కడ వరుస పెట్టి సినిమాలలో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా.... పూజ హెగ్డే బాలీవుడ్ లో నటించిన ఓ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది. పూజ హెగ్డే - షాహిద్ కపూర్ జంటగా నటించిన సినిమా "దేవా".
ఈ సినిమా జనవరి 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. కాగా, ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయట. విపరీతమైన రొమాన్స్, లిప్ లాక్ సీన్లు ఎక్కువగా ఉండడంతో సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు, అసభ్య పదజాలం ఉన్న సన్నివేశాలు ఉండడంతోనే సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది.
ఈ సినిమాలో 6 సెకండ్ల పాటు లిప్ లాక్ సీన్లను కూడా సెన్సార్ కట్ చేసినట్లుగా సమాచారం అందుతుంది. షాహిద్ కపూర్-పూజ హెగ్డే మధ్య ఈ లిప్ లాక్ సీన్ డోస్ కాస్త ఓవర్ గా ఉండడంతోనే ఆ సీన్లను కట్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి హీరో షాహిద్ కపూర్ తో పూజా హెగ్డే విపరీతంగా రొమాన్స్ చేసిందని సెన్సార్ కట్ లను చూస్తే తెలిసిపోతుంది. కాగా, ఈ సినిమా కోసం బాలీవుడ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.