టాలీవుడ్ లో ఎప్పటికీ ఎంతమంది హీరోలు ఉన్నా గత మూడు దశాబ్దాలు గా నలుగురు సీనియర్ హీరోలు నాలుగు మూల స్తంభాలు గా ఇండస్ట్రీ ని నడుపుకుంటూ వచ్చారు .. ఆ నలుగురు హీరోలు మరి ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నటసింహం బాలకృష్ణ , విక్టరీ వెంకటేష్ , యువసామ్రాట్ అక్కినేని నాగార్జున .. ఈ నలుగురు హీరోలు నాలుగు స్తంభాలు గా ఇండస్ట్రీని నాలుగు దశాబ్దాలు గా నడుపుకుంటూ వస్తున్నారు . ఇదిలా ఉంటే సీనియర్ హీరోల లో చిరంజీవి - బాలకృష్ణ పోటా పోటీ గా సినిమాలు చేస్తూ తమ మార్కెట్ ను కాపాడుకుంటూ వస్తున్నారు .
అయితే ఇటీవల కాలం లో బాలకృష్ణ వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాల తో దూసుకుపోతుంటే చిరంజీవి మాత్రం రీయంట్రీ ఇచ్చాక తన స్థాయికి తగిన హిట్ సినిమా మాత్రం అందుకోలేకపోతున్నారు .. చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఒక్క వాల్తేరు వీరయ్య సినిమా మాత్రమే కమర్షియల్ గా మంచి విజయం సాధించింది .. అయితే ఇప్పుడు చిరంజీవి , బాలయ్యకు హిట్లు ఇచ్చిన డైరెక్టర్ల వెంట పడుతున్నారు .. బాలయ్యకు భగవంద్ కేసరి ఇలాంటి హిట్ సినిమా ఇచ్చిన అనిల్ రావిపూడి తో చిరంజీవి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ..
అలాగే బాలయ్యకు తాజాగా డాకు మహారాజ్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన బాబీ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేసేందుకు చిరంజీవి ఓకే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది .. చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సోషియో ఫాంటసీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే .. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఒదల దర్శకత్వంలో సినిమా ఉంటుంది ఆ తర్వాత వరుసగా అనిల్ రావిపూడి , బాబీ సినిమాలో సెట్స్ మీదకు వెళతాయి ..