ఈ క్రమంలోనే తారక్‌కు చిరంజీవి నటించిన అన్ని సినిమాల్లో ఒకే ఒక్క సినిమా ఎంతో ఫేవరెట్ అంటూ.. వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ స్వయంగా ఈ విషయాన్ని వివరించడం విశేషం. ఎన్టీఆర్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటివరకు చిరంజీవి నటించిన అన్ని సినిమాల్లో నా ఫేవరెట్ రుద్రవీణ సినిమా అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమా ఎన్టీఆర్‌కే కాదు ఇప్పుడు జనరేషన్ వాళ్లకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కే.బాలచందర్ డైరెక్షన్ లో క్లాసికల్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోకపోయినా.. మెగా అభిమానులకు మాత్రం తెగ నచ్చేసింది.
చిరంజీవికి జోడిగా శోభన హీరోయిన్గా నటించిన ఈ సినిమా చిరు కెరీర్‌లోనే ఎంతో స్పెషల్ సినిమాగా నిలిచిపోయింది. ఇక ప్రస్తుతం చిరంజీవి నటించిన ఫ్లాప్ సినిమా తారక్‌కు ఇష్టమని తెలియడంతో అభిమానులంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే చిరంజీవి నటించిన ఆ కథ నిజంగానే అద్భుతంగా ఉంటుందని.. భారీ సక్సెస్ దక్కకపోయినా అభిమానుల ఆదరణ పొందుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక చిరంజీవి, తారక్ ప్రస్తుతం ఎవరి సినిమాల్లో వారు బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ లో వరుస అవకాశాలను అందుకుంటున్నాడు. ఇక చిరంజీవి కూడా విశ్వంభరతో పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అందుకునేందుకు తెగా శ్రమిస్తున్నాడు.