ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వరుస అవకాశలను అందుకుంటూ దూసుకుపోయింది అనుష్క శెట్టి. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ .. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది. తాజాగా రీ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అడ‌పాద‌డ‌పా సినిమాల‌లో న‌టిస్తుంది. ఇక అనుష్కకు సౌత్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . సూపర్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ తో పాటు తమిళ్లో కూడా సినిమా అవకాశాలు అందుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది .


ఇక తెలుగులో ప్రభాస్ తో కలిసి నటించిన సినిమాలన్నీ భారీ సక్సెస్ లు అవ్వడంతో వీరిద్దరి మధ్యన ఎఫైర్ ఉందంటూ వార్తలు వేరే లెవెల్ లో వినిపించాయి . ఇలా ప్రభాస్ , అనుష్క జంటకు మరో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ కూడా ఏర్పడింది . ఇక వీరిద్దరూ కలిసి చివరిగా బాహుబలి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే . ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్‌ సంపాదించుకున్న అనుష్కా తర్వాత సినిమాలకు దూరమైంది. ఇక ఇప్పుడిప్పుడే మ‌ళ్ళీ సినిమా అవకాశలను అందుకుంటుంది అనుష్క .. ఎలాంటి సినిమాలో అయినా గ్లామర్ షోలో లిమిట్స్ క్రాస్ చేయదు.


అలాగే ఆమె ఎక్కడ బయటకు వెళ్లాలన్న .. ఏ ఈవెంట్లకు వెళ్లాలన్నా చాలా పద్ధతిగా వస్తూ అందరిని ఆకట్టుకుంటారు. ఇక అనుష్కను ఎప్పుడు చూసినా మొహం పై ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది. అయితే ఏదైనా సందర్భంలో అనుష్క పెద్దగా నవలసి వస్తే మాత్రం కచ్చితంగా ఆమె చెయ్యి నోటికి అడ్డుపెట్టుకొని ముక్కు గట్టిగా అదిమిపెట్టి న‌వ్వుతుంది. తన నవ్వు బయటకు కనిపించకుండా దాచేస్తుంది. దీంతో ఈ విష‌యాని గ‌మ‌నించిన చాలామంది నవ్వేటప్పుడు అలా అడ్డు పెట్టుకోవడం ఏంటి అనుష్క .. ఇదెక్కడి అలవాటు అంటూ ఫన్నీ కామెంట్ చేస్తూన్న‌రు  . ఇక ప్రస్తుతం అనుష్క ఓ మలయాళ సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతుంది. అలాగే త్వరలోనే పిరీష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఘాటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనుష్క.

మరింత సమాచారం తెలుసుకోండి: