చివరికి తన లగేజ్ సెక్యూరిటీ ట్యాగ్ కూడా చేయలేదని ఒకవేళ అందులో ఏదైనా వస్తువు మిస్ అయితే ఎవరి బాధ్యత తీసుకుంటారు అంటూ ఇదంతా కూడా ఎయిర్ లైన్స్ నిర్లక్ష్యమే అంటూ వరుస ట్విట్ చేసింది మంచు లక్ష్మి.. తన బ్యాగ్ కు ట్యాగ్ వేయకుండా చేసినటువంటి కొన్ని వీడియోలను షేర్ చేసింది. మరి వీటి పైన విమాన సంస్థ ఇండిగో ఎలా విధంగా స్పందిస్తుందో చూడాలి మరి. టాలీవుడ్ హీరో మంచు మోహన్ బాబు నటవారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంటర్ ఇచ్చింది మంచు లక్ష్మి.
ఈమె హీరోయిన్ గా కూడా ట్రై చేసిన సక్సెస్ కాలేకపోవడంతో పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటించిన మంచు లక్ష్మి. అయినా కూడా అదృష్టం కలిసి రాలేకపోవడంతో ఈమె పాత్రలు ఏవి కూడా ఈమెకు చెప్పుకోదగ్గ సక్సెస్ను అందించలేదు. ప్రస్తుతం తన నివాసాన్ని ముంబైకి షిఫ్ట్ చేసింది ఎక్కువగా అక్కడే ఉంటుంది మంచు లక్ష్మి అంతే కాకుండా తన కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. అలాగే బాలీవుడ్ వైపుగా కూడా అడుగులు వేస్తున్నట్లు వార్తలయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయంతో మళ్లీ వార్తలలో నిలుస్తోంది మంచు లక్ష్మి.