మాస్ మహారాజ్ రవితేజ సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తన నటనతో ప్రస్తుతం స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఫ్లాప్స్, హిట్స్ అంటూ సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే ఇతనికి స్టార్టింగ్‌లో చిన్న చిన్న రోల్స్ చేసినా అంతగా గుర్తింపు రాలేదు. అలా ఫస్ట్ టైం కృష్ణవంశీ తెరకెక్కించిన ‘సింధూరం’ సినిమాలో నటుడు బ్రహ్మాజీతో పాటు సెకండ్ హీరోగా చేశారు. ఇక తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు.దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ ఇప్పటికీ యంగ్ హీరోలకి పోటీ ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. కొన్నాళ్లుగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నిన్న రిపబ్లిక్ డే, అలాగే రవితేజ బర్త్డే సందర్భంగా మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన డిజాస్టర్ మూవీ అయినటువంటి ‘నేనింతే’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసారు.దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఈ మూవీ మరోసారి థియేటర్లలో సందడి చేసింది.కాగా ఈ చిత్రంలో రవితేజ సరసన శియా గౌతమ్ హీరోయిన్‌గా నటించింది.

అలాగే ఇందులో బ్రహ్మానందం, వేణుమాధవ్, సుప్రీత్, సుబ్బరాజు కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినా.. డైరెక్టర్ పూరి మేకింగ్, రవితేజ యాక్టింగ్ మాత్రం సినీ ప్రియులను కట్టిపడేసిందనే చెప్పుకోవాలి.ఈ క్రమంలో రీ రిలీజ్‌ను అభిమానులతో పాటు రెగ్యులర్‌ ఫ్యాన్స్ చాలా ఎంజాయ్‌ చేశారు. ముఖ్యంగా కృష్ణనగరే మామ.. పాటకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది. 2008లో వచ్చిన నేనింతే సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఫ్లాప్‌గా నిలిచినా రీ రిలీజ్‌లో మాత్రం బ్లాక్ బస్టర్‌ సినిమా స్థాయి రెస్పాన్స్‌ దక్కించుకుంది. చక్రి ట్యూన్ కి భాస్కర భట్ల సాహిత్యం చక్కగా కుదిరి సినిమా అవకాశాల కోసం కష్టపడే కుర్రాళ్ళ కష్టాలను కళ్ళకు కట్టినట్టు వినిపించాయి. ఇదంతా గతంలో దక్కిన ఫలితం.నిన్న నేనింతేకు వచ్చిన స్పందన నెక్స్ట్ లెవెల్ లో ఉంది. విజనరీ పూరి అంటూ మూవీ లవర్స్ ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇప్పటి పరిస్థితులను అప్పట్లోనే అంచనా వేసి సహజత్వానికి దగ్గరగా ఎలా తీశారంటూ పోస్ట్లు పెడుతున్నారు. ముఖ్యంగా ఫేక్ కలెక్షన్లు, రివ్యూలు, పోస్టర్ల గోల, థియేటర్ దగ్గర పబ్లిక్ టాక్ లాంటి ఎన్నో విషయాలు కథలో అంతర్భాగంగా గొప్పగా కుదిరాయని ప్రశంసిస్తున్నారు.ఇదిలావుండగా నేనింతే మూవీ మూడు నంది అవార్డుల‌ను గెలుచుకుంది. బెస్ట్ హీరోగా ర‌వితేజ‌, బెస్ట్ డైలాగ్ రైట‌ర్‌గా పూరి జ‌గ‌న్నాథ్‌, బెస్ట్ ఫైట్ మాస్ట‌ర్లుగా రామ్ ల‌క్ష్మ‌ణ్‌లు అవార్డుల‌ను గెలుచుకున్నారు. ర‌వితేజ పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో నేనింతేతో పాటు ఇడియ‌న్‌, అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి, ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌హ్మ‌ణంతో పాటు దేవుడు చేసిన మ‌నుషులు సినిమాలొచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: