- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నంద‌మూరి నటసింహం బాలయ్యబోయపాటి శ్రీను కాంబినేషన్లో ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన మూడు సినిమా లు ఒక దానిని మించి మ‌రొక‌టి హిట్ కొట్టాయి. ఈ క్ర‌మంలో వీరి కాంబోలో చివ‌రి సారిగా వ‌చ్చిన అఖండ లాంటి హిట్ సినిమా కు సీక్వెల్ గా రాబోతున్న ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభ‌మ‌య్యాయి. ఇక తాజా గా ఈ సినిమా షూట్ కి రెడీ అవుతుంది టీమ్. అలాగే వచ్చే నెల రెండో వారం నుంచి బాలయ్య పై రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా త‌ర్వాత షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతుంది.


సినిమా లో కీల‌క‌మైన అఘోర పాత్రకు సంబంధించిన ఎంట్రీ సన్నివేశాలను షూట్ చేస్తారట. అందుకు సంబంధించిన సెట్స్ ను ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో వేస్తున్నట్లు గా కూడా తెలుస్తోంది. ఇక ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను ప్ర‌స్తుతం ఈ సినిమా లో న‌టించే న‌టీ న‌టుల ఎంపిక మీద బాగా కాన్ సంట్రేష‌న్ చేస్తున్నారు. పలు కీల క పాత్రల్లో ఇతర భాషల నటులను తీసుకోవాలని మేకర్స్ ఫిక్స్ అయ్యార ని కూడా స‌మాచారం. మెయిన్ హీరోయిన్ గా సంయుక్త మీన‌న్ ను ఎంపిక చేశారు. అలాగే అఖండ సినిమా లో ఉన్న ప్ర‌గ్య జైశ్వాల్ ఈ సినిమా లో కూడా న‌టిస్తున్నారు. అలాగే మూడో హీరోయిన్ పాత్ర కూడా ఉంటుంద‌ని అంటున్నారు. ఇక ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట క‌లిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.బాల‌య్య ఎంతో ముద్దుగా పిలుచుఉనే ఎన్బీకే థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: