తమిళ టాప్ హీరో విజయ్ తమిళనాడు రాజకీయాలలోకి ప్రవేశించడంతో తన ఆఖరి చిత్రంగా ఒక పొలిటికల్ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే సంవత్సరం తమిళనాడులో జరగబోతున్న ఎన్నికలలో ఖచ్చితంగా విజయ్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ ఒక కీలక శక్తిగా మారనున్నది. ఈ సంవత్సరం దసరా కు విడుదల కాబోతున్న ఈమూవీకి ‘నాలయ తీర్పు’ అన్న టైటిల్ ఫిక్స్ చేశారు. త్వరలోనే ఈమూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ విడుదల కాబోతున్నాయి.



తెలుగులోకి  డబ్ కాబడుతున్న ఈమూవీని ‘రేపటి తీర్పు’ అన్న టైటిల్ తో విడుదల చేయబోతున్నారు. విజయ్ నటించే ఆఖరి చిత్రం కాబట్టి ఈమూవీ కలక్షన్స్ విషయంలో రికార్డులను క్రియేట్ చేస్తుందని అంచనాలు వాస్తున్నాయి. లేటెస్ట్ గా సంక్రాంతికి విడుదలై సంచలనాలు క్రియేట్ చేస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమిళ నటుడు వీటీవీ గణేష్ ఈసినిమాకు సంబంధించిన ఒక ఆశక్తికర విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో తెలియచేశాడు.  



ఈసినిమాకు మూల కథ బాలకృష్ణ అనీల్ రావిపూడిల దర్శకత్వంలో వచ్చిన ‘భగవంత్ కేసరి’ అని గణేష్ పరోక్షంగా లీకులు ఇచ్చాడు. ఈసినిమా మూల కథకు మార్పులు చేర్పులు చేసి విజయ్ తో తీయబోతున్న మూల కథగా మార్చారని అంచనాలు వస్తున్నాయి. వాస్తవానికి విజయ్ కెరియర్ ఇప్పుడు పీక్ లో ఉంది. అతడు నటించే సినిమాలకు 100 కోట్లకు పైగా భారీ పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు.



ఇలాంటి పరిస్థితుల మధ్య తన వందల కోట్ల ఆదాయాన్ని వదులుకుని విజయ్ రాజకీయాల బాట పట్టడం ఇప్పటికే సంచలనంగా మారింది. వాస్తవానికి విజయ్ మళ్ళీ పవన్ కళ్యాణ్ లా సినిమాలు చేస్తూ రాజకీయాలు చేస్తాడు అన్న ఆలోచనలు విజయ్ అభిమానులలో ఉన్నప్పటికీ అటువంటి సంకేతాలు విజయ్ క్యాంప్ నుండి రావడం లేదు. ‘శతురంగ వేట్టై’ ‘నీర్కొండ పార్వై’ ‘వలిమై’ ‘తునివు’ చిత్రాలను రూపొందించిన హెచ్.వినోద్ విజయ్ ఆఖరి సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే..



మరింత సమాచారం తెలుసుకోండి: