- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న డైరెక్ట‌ర్ల లో కమర్షియల్ డైరెక్టర్ గా అనిల్ రావిపూడికి ప్రస్తుతం ఫుల్ క్రేజీ ఉంది. అస‌లు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సినిమా వ‌స్తోంది అంటే చాలు అంచ‌నాలు పై నుంచి కింద‌కు తారా స్థాయిలో ఉంటున్నాయి. తాజా గా ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ సంక్రాంతికి వస్తున్నాం ’ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నిజంగా నే చరిత్ర సృష్టించింది. ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మొత్తమ్మీద భారీ విజయాన్ని సాధించడం తో అనిల్ రావిపూడి వ‌న్ మ్యాన్ షో బాగా ప‌ని చేసింద‌నే చెప్పాలి. సినిమా రిలీజ్ కు ముందు నుంచే ప‌క్కా ప్లానింగ్ తో చేసిన ప్ర‌మోష‌న్లు ఓ మామూలు కామెడీ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ కూడా ఈ రోజు ఏకంగా రు. 300 కోట్లు కొల్లగొట్టే రేంజ్ కు వెళ్లిందంటే మామూలు సంచ‌ల‌నం కాద‌నే చెప్పాలి.


అస‌లు ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం క‌ళ్యాణ్ రామ్ హీరోగా వ‌చ్చిన ప‌టాస్ సినిమా తో అనిల్ రావిపూడి విజ‌యాల ప్ర‌స్థానం ప్రారంభ‌మైంది. ప‌టాస్ - రాజా ది గ్రేట్ - సుప్రీమ్ ఆ త‌ర్వాత స‌రిలేరు నీకెవ్వ‌రు - ఎఫ్ 2 - ఎఫ్ 3 - భ‌గ‌వంత్ కేస‌రి తాజా గా సంక్రాంతికి వ‌స్తున్నాం అన్ని సూప‌ర్ డూప‌ర్ హిట్లే ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం లో వ‌చ్చాయి. ఈ క్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ – అనిల్ రావిపూడి మధ్య ఓ ఇంట్రెస్టింగ్ చర్చ తాజా గా తెర‌మీద‌కు వ‌చ్చింది.  తన సినిమాలను గోదావరి జిల్లాల అభిమానులు మరింత ఎక్కువగా ఆదరిస్తారని అనిల్ రావిపూడి ఈ సంద‌ర్భం గా చెప్పుకొచ్చారు. గోదావరి అంటే మర్యాదకు మారు పేరు అని .. ఈ క్రమంలో డార్లింగ్ ప్రభాస్‌తో మీరు సినిమా ఎప్పుడు తీస్తారని ప్రభాస్ అభిమానులు ప్రశ్నిస్తే తాను కూడా అందుకే ఎదురు చూస్తున్నానని అనిల్ రావిపూడి బదులిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: