2024 బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా పుష్ప ది రూల్ మూవీ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప ది రూల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కు సంబంధించి ఒకింత గందరగోళం నెలకొన్న తరుణంలో ఈ సినిమా ఈ నెల 30వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది.
 
పుష్ప ది రూల్ మూవీ రీలోడెడ్ వెర్షన్ సీన్లు కూడా ఓటీటీ వెర్షన్ లో ఉండనున్నాయని సమాచారం అందుతోంది. 3 గంటల 40 నిమిషాల రన్ టైమ్ తో ఓటీటీలో పుష్ప ది రూల్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో సంచలనాలు సృష్టించిన ఈ సినిమా ఓటీటీలో సైతం సంచలనాలను కొనసాగించాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 1896 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.
 
అన్ని ప్రముఖ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుండటం గమనార్హం. పుష్ప ది రూల్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో సైతం సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని సినీ అభిమానులు భావిస్తున్నారు. పుష్ప ది రూల్ మూవీకి సీక్వెల్ కూడా తెరకెక్కనుండగా ఈ సీక్వెల్ కోసం సినీ అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప ది రూల్ బాక్సాఫీస్ ను సైతం రూల్ చేసిందని చెప్పవచ్చు.
 
స్టార్ హీరో అల్లు అర్జున్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా పుష్ప ది రూల్ నిలిచింది. అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది. అల్లు అర్జున్ భాషతో సంబంధం లేకుండా క్రేజ్ ను పెంచుకుంటున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్ లో పెరుగుతుండగా రాబోయే రోజుల్లో ఈ హీరో మరిన్ని సంచలనాలు సృష్టిస్తారేమో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: