ప్రస్తుతం సినిమా రంగం అంతా ఓ జూదం అయిపోయింది. ఎంత పెద్ద నిర్మాత అయినా .. అది రీజన ల్ సినిమా అయినా .. పాన్ ఇండియా సినిమా అయినా కూడా సినిమా తీయడం కాదు. సరిగ్గా మార్కెటింగ్ చేసుకోవడం తెలిసి ఉండాలి. విడుదలకు ముందు డిజిటల్ రైట్స్ అమ్ముకుంటే చాలు ఆ సినిమా దాదాపు గండం గట్టెక్కేసినట్టే అనుకోవాలి. ఈ విషయం లో కొందరు నిర్మాతలు పక్కా ప్లానింగ్ తో ముందుకు వెలుతున్నారు. అలాగే యువ నిర్మాత రాజేష్ దండా కూడా కాస్త తెలివి గా ఆలోచన చేస్తున్నారు.
ఆయన చేపట్టిన ప్రాజెక్టులు అన్నీ అలాగే ఉంటున్నాయి. ఆ ప్రాజెక్టులు అన్నీ రిలీజ్ కు ముందే ఆయనకు మంచి లాభాలు తెచ్చి పెడుతున్నాయి. రిలీజ్ కు ముందే సేఫ్ జోన్ లో ఉండేలా ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా ఆయన సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిస్తోన్న మజాకా సినిమా కూడా రిలీజ్ కు ముందే ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది. మజాకా సినిమా ఫిబ్రవరి లో రిలీజ్ కు రెడీ అవుతోంది.
జీ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకొంది .. అది కూడా టాప్ లేపే రేటు కావడం తో టాలీవుడ్ అంతా షాక్ అవుతోంది. దాదాపు రూ.20 కోట్లకు డీల్ కుదిరిందని సమాచారం. జీతో ముందే డీల్ అయిపోయిందని, ఆ తరవాతే.. ఈ సినిమాని సెట్స్‌పైకి వెళ్లిందంటున్నారు. సినిమా బడ్జెట్ రు. 33 కోట్లు అంటున్నారు. ఇప్పటికే రు. 20 కోట్లు వచ్చేశాయి. రు. 13 కోట్లు వస్తే చాలు .. మీడియం రేంజ్ సినిమా లకు హిట్ టాక్ వస్తే వసూళ్లు ఎలా ఉంటున్నాయో చూస్తూనే ఉంటున్నాం. ఏదేమైనా మజాకా మంచి ప్రాపిటబుల్ వెంచరే అనుకోవాలి.