అనిల్ రావిపూడి ..ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టేటస్ సంపాదించుకుంటేనే కాదు కామెడి అనే ఒక బేస్ తో కూడా హిట్ కొట్టొచ్చు అని ప్రూవ్ చేసిన డైరెక్టర్ . రీసెంట్గా "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో ఎలాంటి హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ కి జనాలు ఫిదా అయిపోయారు. ఒక భార్యాభర్తల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలను సినిమా తెరపై చాలా చక్కగా డైరెక్ట్ చేసి కడుపుబ్బ నవ్వించాడు. 


ఈ సంక్రాంతికి ఫుల్ మీల్స్ సినిమా అని చెప్పాలి . "సంక్రాంతికి వస్తున్నాం" కలెక్షన్స్ కూడా బాగా ప్రాఫిట్స్ సంపాదించుకుంది. అయితే అనిల్ రావిపూడి తర్వాత చిరంజీవితో ఒక సినిమా చేస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . పరోక్షకంగా అనిల్ రావిపూడి కూడా ఆ విషయాన్ని కన్ఫామ్ చేస్తూనే వస్తున్నాడు . అయితే అనిల్ రావిపూడి మా ఫేవరెట్ హీరోతో కూడా సినిమా చేయాలి అంటూ ఓ వర్గం ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు. ఆయన మరెవరో కాదు "ప్రభాస్".



పాన్ ఇండియా లెవెల్ లో పబ్లిసిటీ పాపులారిటీ సంపాదించుకున్న ఈ రెబల్ హీరో ప్రజెంట్ చేతిలో ఎన్ని బడా సినిమాలతో దూసుకుపోతున్నాడో  అందరికీ తెలిసిందే . అసలు క్షణం కూడా తీరిక లేకుండా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ షెడ్యూల్స్ ని కూడా ఫిక్స్ చేసుకున్నారు . అలాంటి ప్రభాస్ తో అనిల్ రావిపూడి ఒక సినిమాను తెరకెక్కిస్తే బాగుంటుంది అని అది కూడా పూర్తిగా కామెడీ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లోనే తెరకెక్కించాలి అని కోరుకుంటున్నారు రెబల్ ఫ్యాన్స్.



ప్రభాస్ ని పాన్ ఇండియా లెవెల్ లో మాస్ లుక్ లో చూసి బోర్ కొట్టేసింది అని.. ఫ్యామిలీ గెటప్ లో చూడాలి అనుకుంటున్నాము అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు . అనిల్ రావిపూడి-  ప్రభాస్ కాంబోలో సినిమా అంటే రికార్డులు బద్దలై పోవు. మరీ ముఖ్యంగా ప్రభాస్ ని ఫ్యామిలీ యాంగిల్ లో చూడాలి అంటూ ఎప్పటినుంచో రెబల్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు . నిజంగా అది జరిగితే మాత్రం సూపర్ గా ఉంటుంది. చూద్దాం మరి అనిల్ రావిపూడి - ప్రభాస్ ల కాంబోలో సినిమా వస్తుందేమో..????

మరింత సమాచారం తెలుసుకోండి: