క్రికెట్ లో సెంచరీ కొట్టిన తరువాత ఆటగాళ్లు రిలాక్స్ అవుతారు. అప్పటి వరకు సెంచరీ కోసం ఎంతో కష్టపడతారు. ఈ క్రమంలో వారు సెంచరీ ఎప్పుడు చేస్తారా ? అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరి లోనూ ఉంటుంది. ఆ తర్వాత వారు రిలాక్స్ అవుతారు. అయితే కొందరు ఆటగాళ్లు మళ్లీ గార్డ్ తీసుకుని.. ఫ్రెష్ గా ఆట మొదలెడతారు.. వాళ్లనే లెజెండ్స్ అంటారు . మన నందమూరి నటసింహం బాలయ్య కూడా ఇప్పుడు ఈ లెజెండ్ జాబితా లోకే వస్తాడు.
తాజాగా బాలయ్య కు పద్మ అవార్డు దక్కింది. ఇది ఇప్పటికే ఉన్న బాలయ్య కెరీర్ లో అవార్డులు .. రివార్డుల పరంపరలో మరో ఆణిముత్యం అని చెప్పాలి. బాలయ్య ఎన్నోసార్లు చెప్పినట్టు బాలయ్య కు అవార్డు వస్తే .. ఆ మాటకు వస్తే నందమూరి ఫ్యామిలీకి అవార్డు వస్తే అవార్డుకే అందం తప్పా .. వీళ్లకు కాదు. ఇక చాలా మంది నటులు కూడా 60 ఏళ్లు దాటిన తరువాత రిలాక్స్ అవుతారు. కానీ బాలయ్య మాత్రం .. 60 దాటిన తరువాత ఫ్రెష్ గా గార్డ్ తీసుకుని.. ఆట ఇంకా కసిగా మొదలు పెట్టాడు .. ఆ తరవాత కొట్టిన ప్రతి బంతి సిక్స్ కొట్టాడు. అది ఎలా అంటే ఇమేజ్ మేకోవర్ అనే సబ్జెక్ట్ ఉంటే .. దానిలో బాలయ్య ఇమేజ్ మేకోవర్ అనేది మొదటి కేస్ స్టడీ గా ఉంటుంది.
ఇక ఈ వయస్సు లో అఖండ తర్వాత చూస్తే బాలయ్య ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సినిమా సినిమా కు బాలయ్య ఇమేజ్ అమాంతం పెరుగుతూ వస్తోంది. అందుకే బాలయ్య వేసిన ప్రతి బాల్ సిక్సర్ కొడుతున్నాడు అని చెప్పాలి. అందుకే ఈ వయస్సులో బాలయ్య క్రేజ్ శిఖరాగ్రంలో ఉంటోంది.