చాలామంది సీనియర్ హీరోయిన్స్ సైతం వివాహం చేసుకోకుండా ఇప్పటికి సినిమాలలో నటిస్తూ ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ టబు, శోభన, నగ్మా తదితర హీరోయిన్స్ ఉన్నారు. దక్షిణాదిలోనే ఒకప్పుడు టాప్ హీరోయిన్గా పేరు సంపాదించిన శోభన ఇప్పటికి ఏమి వివాహం చేసుకోకుండా సింగల్ గానే ఉన్నది.. ప్రస్తుతం శోభన వయసు 54 సంవత్సరాలు ఇప్పటికీ ఆమె వివాహానికి దూరంగా ఉన్నది. గతంలో  ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని సైతం తెలియజేసిందట. శోభన 1970 మార్చి 21న కేరళలోని తిరువనంతపురంలో జన్మించిందట.


1980లో మంగళ నాయకి అనే సినిమా ద్వారా మొదటిసారి చైల్డ్ యాక్టర్ గా తన సినీ కెరియర్ ని మొదలు పెట్టింది. 1984లో కమలహాసన్ జోడిగా మదుల్ ఓరువన్ చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిందట. ఆ తర్వాత రజనీకాంత్, చిరంజీవి, బాలయ్య, నాగార్జున తదితరస్టార్ హీరోల చిత్రాలలో కూడా నటించింది. సుమారుగా 200లకు పైగా చిత్రాలలో నటించిన శోభనకు 2006లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును కూడా ఇచ్చేందట. ఇప్పుడు తాజాగా పద్మభూషణ్ అవార్డును కూడా అందుకోవడం జరిగింది.



ఈ క్రమంలోనే శోభనకు సంబంధించి పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ముఖ్యంగా శోభన వివాహం చేసుకోకపోవడానికి ముఖ్య కారణం తనకు పెళ్లి పైన నమ్మకం లేక వివాహం చేసుకోలేదని పెళ్లి చేసుకోవడం వల్ల వ్యక్తిగత స్వేచ్ఛను కూడా కోల్పోవలసి వస్తుంది అంటూ తెలియజేసిందట. అందుకే నటి శోభన కు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదని తెలియజేసింది. ఇటీవలే రీఎంట్రీ సినిమాలలోకి ఇచ్చి మంచి మంచి పాత్రలు నటిస్తూ ఉన్నది. మరి రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాలలో నటించాలని అభిమానులయితే కోరుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా ఈమె సింగల్ గానే తన జీవితాన్ని గడిపేస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: