స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న నయనతారని ఆయన టార్చర్ చేయడం నేను స్వయంగా చూశాను అంటూ పెద్ద బాంబ్ పేల్చారు అక్కినేని నాగార్జున. మరి ఇంతకీ నయనతారను టార్చర్ చేసింది ఎవరు? నాగార్జున ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారు అనేది ఇప్పుడు చూద్దాం.. నాగార్జున నయనతార కాంబినేషన్లో బాస్, గ్రీకువీరుడు వంటి సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమా షూటింగ్స్ జరుగుతున్న సమయంలో ఓసారి నయనతార టార్చర్ కి గురవ్వడం నాగార్జున స్వయంగా చూశారట. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ.. నయనతార నాతో సినిమా చేస్తున్న సమయంలో మేము ఔట్ డోర్ లొకేషన్ కి పాట షూట్ కోసం వెళ్ళాం. ఆరోజు నయనతార తన లవర్ నుండి ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేసిందో నేను  చూశాను.ఫోన్ లోనే టార్చర్ మొదలు పెట్టాడు.

అవన్నీ నేను దగ్గరుండి చూశాను. ఆ టైంలో నయనతార ఎంత టెన్షన్ పడుతూ ఎంత ఇబ్బంది పడిందో నేను కళ్ళారా చూశాను. అయితే నయనతార అంత ఇబ్బంది పడ్డా కూడా షాట్ ఓకే రెడీ అయింది అని చెప్పడంతోనే వాటన్నింటినీ మర్చిపోయి నాతో డాన్స్ చేసింది. అయితే అంత సడన్గా ఆమె తన మూడ్ ఎలా మార్చుకొని మళ్లీ సాంగ్లో చేసిందో మాత్రం నాకు అర్థం అవ్వలేదు. నయనతార తన పర్సనల్ లైఫ్ లో జరిగిన ఏ విషయాన్నీ కూడా ప్రొఫెషనల్ లైఫ్ లో చూపించదు.ప్రొఫెషనల్ లైఫ్ లో చాలా స్ట్రాంగ్ గా నిలబడుతుంది. అంత టార్చర్ చేస్తున్న కూడా ఆ టార్చర్ నుండి బయటపడి మళ్లీ సాంగ్ లో డాన్స్ చేయడం నాకు ఆశ్చర్యం కలిగింది అంటూ నాగార్జున నయనతార గురించి షాకింగ్ కామెంట్లు చేశారు.

ఇక నయనతార ఇప్పటివరకు శింబు, ప్రభుదేవా వంటి వారితో డేటింగ్ చేసింది.శింబు తో నయనతార ప్రేమాయణం కొద్దిరోజులే సాగినప్పటికీ ప్రభుదేవా తో మాత్రం నయనతార ప్రేమాయణం చాలా రోజులు సాగింది. అంతే కాదు వీరు పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యారు.కానీ సడన్గా వీరి మధ్య గొడవలు వచ్చి విడిపోయారు. ఇక నయనతార తన డాక్యుమెంటరీ లో కూడా తన లవ్ బ్రేకప్ కి సంబంధించి కొన్ని విషయాలు చెప్పింది. ఇక ఈ డాక్యుమెంటరీ కారణంగా నయనతార వివాదాల్లో కూడా ఇరుక్కుంది. ప్రస్తుతం నయనతార డాక్యుమెంటరీ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: