ఇండస్ట్రీలో హీరోయిన్స్ అందరూ కూడా తమ ప్రేమ - డేటింగ్ -పెళ్లి విషయాని సీక్రెట్ గా దాచేస్తూ ఉంటారు . ఒకప్పుడు ఇలా లేదు . తాము పెళ్లి చేసుకోబోతున్నాము అంత ముందుగానే చెప్పే వాళ్ళు . కానీ ఇప్పుడు మాత్రం గుట్టూ చప్పుడు కాకుండా ప్రేమాయణం నడపటం..డేటింగ్ చేయడం ..నిశ్చితార్ధం కూడా చేసుకున్నాక అప్పుడు ఆ విషయాని బయటపెడుతున్నారు. మరికొందరు.. పెళ్లి చేసుకుని ఆ ఫొటోస్ ను బయట పెట్టడం లాంటివి చేస్తున్నారు . ఒకరు ఇద్దరు కాదు ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీలో ఉండే అందరు హీరోయిన్స్ ఇలాగే చేస్తున్నారు .
మరి ముఖ్యంగా కొంతమంది బాలీవుడ్ బ్యూటీస్ అయితే పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవుతూ ఆ విషయాన్ని కూడా దాచేస్తున్నారు . ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. హీరోయిన్స్ అంటే కొందరు లైఫ్ లో చాలా రోల్ మోడల్ గా తీసుకుంటూ ఉంటారని .. మరి అలాంటి వాళ్ళు ఇలాంటి దరిద్రమైన పనులు చేయొచ్చా..? అంటూ చెప్పుకొస్తున్నారు . మరి కొందరు మాత్రం హీరోయిన్స్ ఎందుకు తమ పెళ్లి విషయాన్ని దాచుతున్నారు అనే విషయాన్ని హైలెట్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు . చాలామంది హీరోయిన్స్ చెప్పకుండానే పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదిక బయటపెట్టారు. మరికొందరు ప్రేమ - డేటింగ్ - పెళ్లి ఆ విషయాలను దాచిపెట్టి నిశ్చితార్థం అయ్యాక తమ పెళ్ళి విషయాన్ని బయట పెట్టారు . సీక్రెట్ గా అన్ని పనులు చేసేస్తూ సీక్రెట్ గానే అన్ని ఉంచడానికి ఇష్టపడుతున్నారు నేటి కాలం హీరోయిన్స్..!