గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ఎప్పుడూ లేనంత భీకరీమైనా ఫామ్‌లో ఉన్నారు. అఖండ సినిమాకు ముందు వరకు వరుస ప్రాకులతో అసలు కెరీర్ ముందుకు సాగుతుందా.. లేదా.. అన్న డైలమాలో బాలయ్య అభిమానులు ఉన్నారు. ఎప్పుడైతే బోయపాటి శ్రీనుతో అఖండ చేశారు. నాటి నుంచి రికార్డులు దుమ్ము దులుపుతున్నారు. కోవిడ్ సమయంలో థియేటర్‌లకు రావడానికి ప్రేక్షకులు భయపడుతున్న వేళ తిరిగి థియేటర్లలో సినిమా వాతావరణం కళకళలాడేలా చేశారు బాలకృష్ణ. అది కూడా చాలా తక్కువ రేట్లతో అఖండ సినిమాతో దుమ్ము దులిపి రికార్డులు తన పేరుతో లెక్కించుకున్నారు బాలయ్య.
ఇటు అదే సమయంలో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి ఎంతోమంది సెలబ్రిటీలను ఆయన ఇంటర్వ్యూ చేస్తున్న తీరుకు అందరూ ఫిదా అయిపోతున్నారు. ఇదిలా ఉంటే సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ సినిమాతో బాలయ్య అదిరిపోయే రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా బాలయ్య తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాలుగా అందిస్తున్న సేవలకు గాను.. కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. దీంతో నందమూరి అభిమానులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బాలకృష్ణ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభిమానులు కోరుతున్నారు.
ఇదిలా ఉంటే బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్ ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై వసూళ్ల పరంగా బాలయ్య కెరీర్‌లోనే పెద్ద ఘన విజయం సాధించింది. డాకు మహారాజ్‌తో కలిపి 3 ఏళ్ల గ్యాప్‌లో 4 బ్లాక్‌బస్టర్లు కొట్టాడు. ఈ నాలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రూ. 530 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి బాలయ్య పేరిట రేర్ రికార్డు నమోదు చేశాయి. అఖండ రూ. 133 కోట్లు, వీరసింహారెడ్డి రూ.134 కోట్లు, భగవంత్ కేసరి రూ.132 కోట్లు చొప్పున మొత్తంగా రూ.399 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టగా... డాకు మహారాజ్ ఇప్పటి వరకు రూ.140 కోట్ల గ్రాస్ అందుకుంది. అలా మొత్తంగా నాలుగు సినిమాల గ్రాస్ కలిపి ఏకంగా రూ.500 కోట్ల మార్క్‌ను దాటేసింది.