ఫిలిమ్ ఇండస్ట్రీకి కొన్ని లెక్కలు ఉంటాయి. క్రైమ్ మూవీ లవ్ యూత్ ఫుల్ మూవీ కామెడీ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ పొలిటికల్ మూవీ అంటూ రకరకాల జోనర్లు ఉంటాయి. ఆజోనర్లకు అనుగుణంగా ఆసినిమా బాగుంటే ప్రేక్షకులు బాగా వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈలెక్కలు అన్నీ వెంకటేష్ అనీల్ రావిపూడిల కాంబినేషన్ లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విషయంలో పనిచేయకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఈసినిమాకు రావడమే కాకుండా ఈసినిమా విడుదలై మూడవ వారంలోకి ఎంటర్ అయినప్పటికీ ఈమూవీ కలక్షన్స్ విషయంలో ఏమాత్రం డ్రాప్ కనపడకపోవడం ఇండస్ట్రీ వర్గాలకు ఆశ్చర్యం అనిపిస్తోంది.



2000 సంవత్సరం వరకు వెంకటేష్ టాప్ హీరోలలో ఒకడు. అతడి కెరియర్ లో చాల హిట్స్ ఉండటంతో అనేకమంది అతడితో సినిమాలు తీయడానికి చాలామంది దర్శక నిర్మాతలు ముందుకు వస్తూ ఉండేవారు. అయితే 2000 సంవత్సరం తరువాత ప్రేక్షకుల అభిరుచి మారిపోయి యంగ్ హీరోల హవా మొదలు కావడంతో వెంకటేష్ క్రేజ్ నెమ్మదిగా తగ్గింది. దానికితోడు అతడు నటించిన సినిమాలలో చాలవరకు ఫెయిల్ అవుతూ ఉండటంతో వెరైటీ సినిమాలు తీసే సమర్థత గల దర్శకులు అతడి వైపు చూడటం తగ్గించేశారు.



అయితే అనీల్ రావిపూడి ‘ఎఫ్ 2’ తీసిన తరువాత ఒక్కసారిగా వెంకటేష్ బౌన్స్ బ్యాక్ అవ్వడమే కాకుండా తాను ఇంకా రేస్ లో ఉన్నాను అని ఇండస్ట్రీకి అర్థంఅయ్యేలా చేశాడు. ఆతరువాత మళ్ళీ అతడిని ఫ్లాప్స్ వెంటాడాయి. మళ్ళీ అదే అనీల్ రావిపూడి వెంకటేష్ లోని కామెడీ యాంగిల్ ను చూపెడుతూ దానికి ఒక క్రైమ్ కథ జోడించి చేసిన ప్రయోగం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈసినిమా ఈరేంజ్ లో బ్లాక్ బష్టర్ హిట్ అవుతుందని అనీల్ రావిపూడి కూడ అనుకోలేదట.



ప్రస్తుతం ఈసినిమా కలక్షన్స్ 260 కోట్ల దగ్గర ఉన్నాయి. ఈసినిమా 300 కోట్ల మార్క్ ను చేరుకోవడం చాల సులువు అన్న అంచనాలు వస్తున్నాయి. వెంకటేష్ కెరియర్ కు సంబంధించి ఇది కలలో కూడ ఊహించని ఫిగర్ అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఎన్నికలలో ఓటర్లు సినిమాల విషయంలో ప్రేక్షకులు ఎప్పుడు ఎలాస్పందిస్తారు అన్నది అంతుపట్టని విషయం..




మరింత సమాచారం తెలుసుకోండి: