తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ బ్రహ్మాగా పేరు తెచ్చుకున్న కమెడియన్ బ్రహ్మానందం అంటే తెలియని వారు ఉండరు. ఈయన ఇప్పటికే వెయ్యికి పైగా సినిమాల్లో నటించి కమెడియన్ గా స్టార్ స్టేటస్ సంపాదించారు.ఒకప్పుడు రాజబాబు, అల్లూ రామలింగయ్య ఎంత కామెడీ చేసే వారో ఆ తర్వాత జనరేషన్లో బ్రహ్మానందం అలాంటి కామెడీతో అంత గొప్ప పేరు తెచ్చుకున్నారు.ఇక ప్రస్తుతం బ్రహ్మానందం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఏదో ఒకటి రెండు సినిమాలు తప్ప చాలావరకు ఆయన సినిమాలకి ఒప్పుకోవడం లేదు. ఇక బ్రహ్మానందం సినిమాల్లో చేయకపోయినప్పటికీ ఆయనకు సంబంధించిన ఫోటోలతో మీమ్స్ ఎన్ని చక్కర్లు కొడతాయో చెప్పనక్కర్లేదు.సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు బ్రహ్మానందం ఫేస్ పెట్టి క్రియేట్ చేసే మీమ్ లు మామూలుగా ఉండవు. అయితే అలాంటి కామెడీ బ్రహ్మా బ్రహ్మానందం తాజాగా వివాదంలో ఇరుక్కున్నారు. నీకు బుర్ర పనిచేయట్లేదా అంటూ రాధా మనోహర్ దాస్ బ్రహ్మానందం పై ఫైర్ అయ్యారు.

మరి ఇంతకీ రాధా మనోహర్ దాస్ బ్రహ్మానందం పై ఫైర్ అవ్వడానికి కారణం ఏంటంటే.. రీసెంట్గా బ్రహ్మానందం ఒకప్పుడు స్త్రీలను చాలా నీచంగా చూసేవారు. కనీసం చదువు కూడా చదువుకోనిచ్చేవారు కాదు.ఆడవాళ్లు చదువుకోకూడదు. ఆడవాళ్లు చదువుకుంటే దారుణమైన పరిస్థితులు చూడాల్సి వస్తుంది అంటూ వారిని భయభ్రాంతులకు గురిచేసి చదువుకోకుండా చేశారు. అలాగే అప్పట్లో స్త్రీలను కనీసం వేదాలు కూడా ముట్టుకోనిచ్చేవారు కాదు అంటూ బ్రహ్మానందం ఓ ఈవెంట్లో మాట్లాడారు. అయితే బ్రహ్మానందం మాటలపై రాధా మనోహర్ దాస్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ..బ్రహ్మానందం మాటలు చూస్తుంటే ఆయనకు బుర్ర పని చేయడం లేదని తెలుస్తోంది.మనం చదువుకునే పుస్తకాన్ని సరస్వతి అని, భూమిని భూమాత, ఆవుని గోమాత, తినే అన్నాన్ని అన్నపూర్ణ, తాగే నీటిని గంగమ్మ, డబ్బులను లక్ష్మీదేవి అని ఆడవాళ్ళను దేవుళ్ళతో కొలుస్తాం.

ఇది మనం ఆడవాళ్లను గౌరవించే తీరు. మనం అమ్మని చూసే విధానం.కానీ బ్రహ్మానందం చదువుకొని లెక్చరర్ అయ్యాడు కానీ ఆయనకు బుర్ర పని చేయడం లేదని ఆయన మాట్లాడిన మాటలు చూస్తే అర్థమవుతుంది. ఎక్కడ ఆడవాళ్లు పూజింపబడతారో అక్కడ దేవతామూర్తులు కొలువై ఉంటారు అని మనుధర్మ శాస్త్రం చెబితే బ్రహ్మానందం మాత్రం బుద్ధిలేని మాటలు మాట్లాడుతూ నోరు జారుతున్నాడు..అంటూ రాధా మనోహర్ దాస్ బ్రహ్మానందం మాటల పై ఫైరయ్యారు. అంతేకాదు బ్రహ్మానందం తాను మాట్లాడిన విధానంపై త్వరలోనే క్షమాపణలు చెబుతాడు అంటూ కూడా చెప్పారు. అలాగే బ్రహ్మానందం ఇతర మతాల వారిని  కూడా ఇలాగే ప్రసంగిస్తాడా అంటూ ప్రశ్నించి అసహనం వ్యక్తం చేశారు రాధా మనోహర్ దాస్.మరి ఈ వ్యాఖ్యలపై బ్రహ్మానందం ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: