టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత ఐదేళ్ల కాలంలో.. కేవలం మూడు సినిమాలు మాత్రమే చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అలవైకుంఠపురం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత పుష్ప సిరీస్ మీద ఐదేళ్ల సమయం కేటాయించారు. పుష్ప‌ 2 సినిమా ఇండియాలోనే నెంబర్ 1 సినిమా అయింది. చివరకు బాహుబలి 2 రికార్డులను కూడా క్రాస్ చేసింది. అయితే ఈ రెండు సినిమాల మీద ఐదేళ్ల సమయం వెచ్చించిన హీరో.. బన్నీ తన తప్పు తెలుసుకున్నట్టు తెలుస్తోంది. ఈసారి ఆ గ్యాప్ పూడ్చాలనుకుంటున్నాడు. రెండు సినిమాలు వీలైనంత తక్కువ గ్యాప్‌లో ఈసారి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.


త్రివిక్రమ్ దర్శకత్వంలో మైథ‌లాజికల్ టచ్ సినిమాను త్వరలోనే ప్రారంభించబోతున్నాడు. ఇది చాలా పెద్ద సినిమా. ఈ సినిమాలో చాలా సీసీ వర్క్‌ ఉంటుందని.. అసలు ఎలా ఫినిష్ చేస్తారు అన్న చర్చ కూడా టాలీవుడ్ వర్గాలలో వినిపిస్తోంది. ఈ సినిమా చేస్తూనే.. సమాంతరంగా మరో సినిమా చేయాలని ఆలోచనలో బన్నీ ఉన్నాడు. దానికి తగిన డైరెక్టర్ కోసం వెతుకుతున్నాడు. ఇప్పటివరకు బన్నీ లిస్టులో దాదాపు ఫైనల్‌కు వచ్చిన దర్శకుల పేర్లు చాలానే ఉన్నాయి. కొరటాల శివ పేరు లైన్లో ఉంది. అలాగే సుకుమార్ కూడా కాచుకొని ఉన్నాడు. తమిళ దర్శకుడు అట్లి పేరు కూడా తెర మీదకు వచ్చింది.


బాలీవుడ్ దర్శకుడు సంజీయ్ లీలా భ‌న్సాలిని కూడా బన్నీ కలిసి వచ్చారు. అయితే ఇవన్నీ మొహమాటానికి మాత్రమే అని ఫైనల్‌గా బన్నీ రెండో సినిమా అట్లీతో చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటు సౌత్ తో పాటు.. నార్త్ బెల్ట్ లో మాస్,యాక్ష‌న్‌కు సెట్ అయ్యే కమర్షియల్ కథ కోసం ఎదురుచూస్తున్నారు. అది పూర్తికాగానే బన్నీ, అట్లీ సినిమా ఎనౌన్స్మెంట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఫిబ్రవరిలో బన్నీ ఒకేసారి తన మూడు ప్రాజెక్టుల గురించి ఎనౌన్ చేసే అవకాశం ఉంది. వాటిలో ముందుగా త్రివిక్రమ్ సినిమా, ఆ తర్వాత అట్లే సినిమా, ఆ తర్వాత పుష్ప 3 ఉంటుంది వీటన్నింటి మీద ఫిబ్రవరిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: