మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరుత మూవీ తో హీరోగా కెరియర్ ను మొదలు పెట్టిన చరణ్ ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే తాజాగా చరణ్ "గేమ్ చేంజర్" అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో చరణ్ రెండు పాత్రలలో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.

శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే నెగటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇకపోతే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదటి నుండి నిలకొని ఉండడంతో ఈ మూవీ కి పెద్ద ఎత్తున ఫ్రీ రిలీజ్ జరిగింది. ఈ మూవీ కి ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 221 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 223 బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇక ఇప్పటి వరకు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 108.52 కోట్ల షేర్ ... 199.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

దానితో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకోవాలి అంటే ప్రపంచ వ్యాప్తంగా మరో 114.48 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టవలసి ఉంది. ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ మూవీ అంత షేర్ కలెక్షన్ లను రాబట్టే పరిస్థితులు కనబడడం లేదు. దానితో ఈ సినిమా భారీ అపజయాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయి అని కొంత మంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: