- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )  . . .


టాలీవుడ్ హీరో నాగచైతన్య, సాయి పల్లవి, చందు మొండేటి కాంబినేషన్‌లో బన్నీవాస్‌ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా తండేల్‌. గీతా ఆర్ట్స్ సంస్థ తమ సొంత ఫ్యామిలీ హీరోల మీద కాకుండా.. ఇతర హీరోల మీద ఈ స్థాయిలో ఖర్చుపెట్టిన సినిమా తండేల్‌ అని చెప్పాలి. తండేల్‌ సినిమా కోసం దాదాపు రూ.85 కోట్లు ఖర్చు చేశారు. మెగా ఫ్యామిలీ హీరోలతో గీతా సంస్థ చేసిన సినిమాలు కాకుండా.. బయట హీరోలతో ఈ స్థాయిలో ఖర్చుపెట్టి చేసిన తొలి సినిమా తండేల్‌. అందులోను వరుస ఫ్లాపులతో ఉన్న అక్కినేని హీరో నాగచైతన్య పై.. ఈ స్థాయిలో ఖర్చు పెట్టడం అంటే చాలా పెద్ద రిస్క్ అని చెప్పాలి. కానీ.. అల్లు అరవింద్, బన్నీవాస్ కలిపి కథ మీద నమ్మకంతో ఈ స్థాయిలో ఖర్చు పెట్టారు.


రూ.85 కోట్లు ఖర్చు కావడంతో థియేట్రిక‌ల్‌ ఆదాయం మీద భారీగా ఆధార‌ పడాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమాకు నాన్‌ థియేటర్ హక్కులు, డిజిటల్, హిందీ ఆడియో అన్నీ కలిపి రూ.50 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. అంటే దాదాపు సగానికి పైగా రికవరీ వచ్చేసింది. అయితే ఇప్పుడు థియేటర్ మీద రూ.35 కోట్లు రాబట్టాలి. గీత ఆర్ట్స్‌ సంస్థకు పంపిణీ వ్యాపారం కూడా ఉంది. దీంతో వీలైనంతవరకు ఈ సినిమాను సొంతంగా విడుదల చేసుకొని రికవరీ సాధించాలని చూస్తోంది. నాగచైతన్య మార్కెట్ బాగా డౌన్ అయింది.


ఈ టైం లో ఎక్కువ రేట్లకు అమ్మటం కుదరదు. కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ఏరియాలలో రూ.15 కోట్లకు విక్రయించారు. సిడెడ్ రూ.4.5 కోట్లకు ఇచ్చారు. నైజం లో సొంతంగా భారీ ఎత్తున రిలీజ్ చేసుకుంటున్నారు. నైజాంలో, ఏపీలో కలిపి కనీసం రూ.30 కోట్ల మేరకు వసూళ్లు వస్తే ఓవర్సీస్, ఇతర భాషల హక్కులతో కలిసి బ్రేక్ ఈవెన్ అవుతారు. ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. నాగచైతన్య కంటే సాయి పల్లవి మీద ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. మరి సాయి పల్లవి ఈ టార్గెట్‌ను రీచ్ అవడంలో ఎంతవరకు తన వంతు సాయం చేస్తుందో.. రేపు సినిమా రిలీజ్ అయ్యాక కానీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: