కోలీవుడ్లో స్టార్ హీరో ఒక పేరు పొందిన ధనుష్, ఐశ్వర్య గడిచిన కొన్ని నెలల క్రితం విడిపోతున్నట్లు ప్రకటించడమే కాకుండా కోర్టు నుంచి విడాకులు కూడా తీసుకున్నారు. ధనుష్ స్టార్ హీరోగా ఎరగడానికి ముఖ్య కారణం ఆయన అన్నయ్య సెల్వ రాఘవన్ అని చెప్పవచ్చు. ధనుష్ తో సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు. ధనుష్ రెండవ సినిమా కాదల్ కొండెన్ ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో రజనీకాంత్ ధనుష్ ని పిలిచి మరి ప్రశంసించారట. ఆ సమయంలోనే ధనుష్, ఐశ్వర్య మధ్య స్నేహబంధం ఏర్పడిందని సమాచారం.



ఆ తర్వాత ఆ స్నేహం ప్రేమగా మారి వీరిద్దరి తల్లిదండ్రులు ఒప్పించి మరి వీరి వివాహాన్ని జరిపించారట. 20 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత గత ఏడాది విడాకులు తీసుకోబోతున్నట్లు తెలిపారు. ఒక్కో చిత్రానికి 50 కోట్లు తీసుకుంటున్న ధనుష్ జాతీయ అవార్డు గ్రహీతగా కూడా పేర సంపాదించారు. అలాగే తెలుగు, హిందీ వంటి భాషలలో కూడా అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుత ఇడ్లీ కడై, కుబేర వంటి చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. ఒక పాత ఇంటర్వ్యూలో ధనుష్ ని ఇలా ప్రశ్నించగా.. కాదల్ కొండెన్ సినిమా కోసం రజనీకాంత్ మిమ్మల్ని పిలిచి ప్రశంసించి మరి కూతుర్ని ఇచ్చారా అని అడగగా?


అందుకు ధనుష్ ఇలా మాట్లాడుతూ తలైవార్ నన్ను పిలిచి ప్రశంసించారు అది నిజమే.. కానీ ఆయన కూతుర్ని ఇవ్వలేదు.. ఆమె వచ్చిందని వెల్లడించారు. ఆ తర్వాత ధనుష్ తో త్రీ అనే సినిమాని దర్శకత్వం వహించింది. ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలింది. కానీ తెలుగులో అభిమానులను పెంచడానికి ఈ సినిమాని కారణమయ్యింది. చివరిగా ఐశ్వర్య లాల్ సలామ్ అనే సినిమాకి దర్శకత్వం వహించగా ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. మొత్తానికి ఐశ్వర్య, ధనుష్ విడాకులు తీసుకున్నప్పటి నుంచి వీరి గురించి ఏదో ఒక న్యూస్ అయితే వినిపిస్తూ ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: