సోషల్ మీడియాకు చాలా అరుదుగా కనిపిస్తూ ఉండే జయసుధ .. పలు ఇంటర్వ్యూలో మాట్లాడే సమయంలో ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటుంది . తాజాగా ఓ ఇంటర్వ్యూలో జయసుధ మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది . ఇండస్ట్రీ గురించి సంచల వ్యాఖ్యలు చేసిన ఈ అమ్మడు .. తెలుగు ఇండస్ట్రీలో నేను కొంతమందిని మాత్రమే సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తా.. అందరిని ఎలా పడితే అలా నేను పిలవను .. కుటుంబ అంటే కుటుంబమే . మోహన్ బాబు , మురళీమోహన్ నన్ను చెల్లమ్మ అంటారు . వాళ్ళని మాత్రమే నేను అన్నయ్య అని పిలుస్తా.
అంతేకానీ ఎవరిని పడితే వారిని అన్నయ్య , అక్క అని పిలవడం నాకు అలవాటు లేదు అంటూ చెప్పుకొచ్చింది . ఈ సీనియర్ బ్యూటీ సినిమాల విషయంలో మాత్రం ఎంతో భిన్నంగా వెళుతుంది .. తన పాత్రకు వాల్యూ ఉన్న సినిమాల్లోనే నటి జయసుధ ముందుకు వెళుతుంది .. అలాగే ఈ సీనియర్ బ్యూటీ మొదటిసారిగా ఇంగ్లీష్ షార్ట్ ఫిలింలో కూడా నటించింది .. ప్రస్తుతం జయసుధ తెలుగు సినిమాలతో పాటు తమిళ హిందీ సినిమాల్లో కూడా నటిస్తుందట.. అలాగే ఈ మధ్యకాలం జయసుధ మూడో పెళ్లి వాతలతో కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం కూడా తెలిసింది.