ఇదే క్రమంలో చిరంజీవి భార్య సురేఖకు కూడా మన సమాజంలో ఎంతో మంచి పేరు ఉంది .. చాలామంది ఆమె గురించి ఎంతో పాజిటివ్ గానే మాట్లాడుతారు .. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టి అభిమానులకు దగ్గరవుతూ ఉంటారు ఆమె . అయితే ఇప్పుడు తాజాగా చిరు భార్య సురేఖ గురించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది .. అసలు విషయం ఏమిటంటే చిరు భార్య సురేఖకి తన కొడుకు రామ్ చరణ్ కంటే తన మరిది నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ అంటేనే ఎంతో ఇష్టమట .. అంతేకాకుండా అతని సినిమాలే ఎక్కువగా చూస్తుందట ..
ఎందుకంటే వరుణ్ తేజ్ చేసే సినిమాలు ఎంతో డిఫరెంట్ గా ఉంటాయని అలాగే వరుణ్ బాబు యాక్టింగ్ కూడా ఎంతో వెరైటీగా ఉంటుందని సురేఖ తన కుటుంబ సభ్యుల వద్ద ఎప్పుడు చెబుతూ ఉంటుందట.ఏ తల్లి అయినా తన కొడుకుకె టాప్ హీరోగా ఉండాలి అనుకుంటుంది. కానీ సురేఖ గారి మైండ్ సెట్ చాలా డిఫరెంట్ అట. టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ సురేఖ ఎంకరేజ్ చేస్తుంది. అందుకే రామ్ చరణ్ సినిమాలైనా మిస్ అవుతుంది ఏమో కానీ వరుణ్ తేజ్ సినిమాలని అస్సలు మిస్ అవ్వనివ్వదు. ఆమె నిజాయితీ తత్వానికి అందరూ మెచ్చుకోవాల్సిందే కదా!