సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి గురించి సోషల్ మీడియాలో బాలీవుడ్ మీడియాలో ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అయితే ఈ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలోనే తాజాగా బాలీవుడ్ సినీ క్రిటిక్ అయినటువంటి కేఆర్కే సంచలన ట్వీట్ చేశారు.బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ గా పేరు తెచ్చుకున్న కే ఆర్ కే పలు వివాదాస్పద ట్వీట్లు చేస్తూ ఇప్పటికే ఇండస్ట్రీలో వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే.అయితే అలాంటి కేఆర్ కే తాజాగా సైఫ్ అలీఖాన్ పై జరిగిన కత్తి దాడి గురించి సంచలన ట్వీట్ చేశారు.krk తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా ట్వీట్ చేశారు.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి జరిగిన రోజు కరీనా ఇంట్లో లేదు. కరీనాకపూర్ పార్టీకి బయటికి వెళ్ళింది. ఆ టైంలో సైఫ్ అలీ ఖాన్ తన ఇంట్లో ఉన్న పనిమనిషితో ఒంటరిగా ఏదో మాట్లాడుతున్న సమయంలో వీరిద్దరిని చూసిన పనిమనిషి ప్రియుడు ఒక్కసారిగా సైఫ్ అలీ ఖాన్ పై కత్తి తీసుకొని పొడిచాడు.

అయితే ఒళ్ళు మండి పనిమనిషి ప్రియుడు చేసిన పనికి షాక్ అయిపోయారు. అయితే పనిమనిషి ప్రియుడు కత్తితో వెన్నెముకలో బలంగా పొడిచేసరికి ఆ వెన్నెముక లో కత్తి విరిగిపోయింది.లేకపోతే సైఫ్ ని మరిన్ని సార్లు కత్తితో పొడిచేవారని తెలుస్తోంది. అయితే బాలీవుడ్ విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ విషయం బయటికి వచ్చింది. అందుకే ఈ విషయం బయటికి తెలిస్తే పరువు పోతుంది అనే ఉద్దేశంతో చోరీ చేశారు ఇంట్లో దొంగలు పడ్డారు అనే కథ అల్లుతున్నారు. అలాగే సైఫ్ అలీఖాన్ ఇంటికి సిసిటివి ఫుటేజ్ కూడా బయట పెట్టడం లేదు. అలాగే సైఫ్ పై దాడి చేసిన వ్యక్తి లోపలికి వెళ్ళినప్పుడు కనిపించ లేదు.కానీ బయటికి వచ్చినప్పుడు మాత్రమే కనిపించారు.. అంటూ కే ఆర్ కే సంచలన ట్వీట్ పెట్టారు.

 అయితే ఈయన ట్వీట్ చూసిన పలువురు నెటిజన్లు కూడా ఈయనకి వత్తాసు పలుకుతున్నారు. ఈయన పెట్టింది నిజమే కావచ్చు. పరువు పోతుందనే ఉద్దేశంతో చోరీ జరిగింది అని అంటున్నారు.అలాగే పోలీసులు బంగ్లాదేశ్ వ్యక్తిని నిందితుడు అని తేల్చారు. కానీ ఆయనకు సంబంధించిన ఫింగర్ ప్రింట్లు సైఫ్ అలీఖాన్ ఇంట్లో అస్సలు మ్యాచ్ అవ్వడం లేదు. ఇందులో ఏదో మతలబ్ ఉంది అనుమానించాల్సింది ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు అంత పెద్ద హీరో ఇంట్లో సీసీ కెమెరాలు ఎక్కువగానే ఉంటాయి. అలాంటిది ఆ సిసిటీవీ ఫుటేజ్ ని ఎందుకు బయట పెట్టడం లేదు అని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.దీంతో కేఆర్కే సైఫ్ అలీ ఖాన్ పై పెట్టిన ట్వీట్ బాలీవుడ్లో వైరల్ గా మారింది

మరింత సమాచారం తెలుసుకోండి: