హీరోయిన్ ఖుషీ కపూర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈమె దివంగత నటి శ్రీ దేవి చిన్న కూతురు. ఈ మధ్యే ఈమె సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఖుషీ కపూర్ నటించిన లవ్ యాపా సినిమా వచ్చే నెల 7వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా తమిళంలో ప్రదీప్‌ రంగనాథన్‌ తెరకెక్కించిన లవ్ టుడే అనే సూపర్‌హిట్‌ మూవీని రిమిక్స్ ఇది.
ఈ నేపథ్యంలో ఆమెని ఇంటర్వ్యూలో ఓ ప్రశ్న అడిగారు. మీరు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నారా అని ఆమెని అడిగారు. దానికి ఖుషీ కపూర్ మాట్లాడుతూ.. హీరోయిన్ అన్నాక అందంగా కనిపించడమే కాదని.. అందాన్ని కాపాడుకోవడం కూడా అని అన్నది. అందుకోసమే హీరోయిన్ లు ప్లాస్టిక్ సర్జరీని ఆశ్రయిస్తారని తెలిపింది. ప్లాస్టిక్‌ సర్జరీ అనేది తన దృష్టిలో కేవలం చిన్న విషయమే అని, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం తప్పేం కాదని చెప్పుకొచ్చింది. అందులో తాను ప్లాస్టిక్ అనే పదాన్ని మాత్రమే చూస్తానని తెలిపింది. ఇతరులు ఎప్పుడు పక్కవారిని ఏదో ఒకటి అనడం కోసం మాత్రమే ప్లాస్టిక్ సర్జరీని ఒక సాగుగా చూస్తారని చెప్పింది. తాను ఇండస్ట్రీలోకి రాకముందే తన గురించి ఎన్నో ఊహాగానాలు సృష్టించారని.. అందులో ఎక్కువగా నెగెటివే ఉందని కపూర్ అన్నది.  
అలాగే తన కనుబొమ్మ వెంట్రుకలు ఒత్తుగా ఉంటాయని.. వాటి మధ్య గ్యాప్ కనిపించిందని చెప్పుకొచ్చింది. అందుకే కనుబొమ్మలు సరిచేయించుకుని, ఆ గ్యాప్ ని ఫిల్ చేయించుకున్నని చెప్పింది. సర్జరీ అయ్యాక పది రోజులవరకు కళ్లపై నీళ్లు పడనివ్వొద్దని చెప్పుకొచ్చరు. స్నానం చేసేందుకు వెళ్లినప్పుడు ధరించమని ఓ షీల్డ్‌ కూడా ఇచ్చారని కపూర్ తెలిపింది. అవి పెట్టుకొని ఫోటోస్ దిగి తన ఫ్రెండ్స్ కి పంపించాను అని కూడా చెప్పుకొచ్చింది. ఇకపోతే ఖుషీ కపూర్ ద ఆర్చీస్‌ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: