సినీ నటి రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రష్మిక, బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ తో నటించిన ఛావా సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో మరోసారి ఈ బ్యూటీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోనుంది. ఇప్పటికే ఈ సినిమా టైలర్ రిలీజ్ వేడుక ముంబాయిలో జరిగింది. కాలికి గాయం అయినప్పటికీ ఆ ఈవెంట్ కి రష్మిక వచ్చింది.
సినిమా ప్రచారంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా రష్మిక మాట్లాడుతూ.. 'ఇల్లు నా హ్యాపీ ప్లేస్. ఇంట్లో నేను చాలా సంతోషంగా ఉంటాను. నాకు ఎక్కడ దొరకని.. ఎక్కడ పొందలేని ఆనందం ఇంట్లోనే దొరుకుతుంది. నేను ఒక కూతురిగా, ఒక సోదరిగా ఎంతోమంది ప్రేమ, అభిమానాలు పొందుతున్నాను. ఎప్పుడు నవ్వుతూ ఉండే వాళ్లు అంటే నాకు చాలా ఇష్టం. అలాగే ఎదుటివారిని గౌరవించే వారంటే కూడా నాకు చాలా ఇష్టం. ఇక నేను కళ్లతో పలికించే హవభావాలను నమ్ముతాను. ఎందుకంటే కళ్లు యే మన మనసుకు ప్రతిబింబాలు' అని రష్మిక చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇకపోతే రష్మిక మందన్న 2016లో కిరిక్ పార్టి అనే కన్నడ మూవీ ద్వారా నటిగా పరిచయమమైంది. ఆతర్వాత ఛలో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆతర్వాత గీత గోవిందం, దేవదాస్, పొగరు, సరిలేరు నికెవ్వరు, భీష్మ, యనిమాల్ సినిమాలు కూడా చేసింది. ఇటీవల ఈ అందాల భామ పుష్ప 2 లో శ్రీవల్లీ పాత్రలో నటించి హిట్ కొట్టేసింది. ఈమె నటనతో చాలా సినిమాల్లో ఛాన్స్ కొట్టేసినప్పటికి.. అంతగా హిట్స్ పడలేదు. కానీ పుష్ప సినిమా తర్వాత ఈమె క్రేజ్ పెరిగిపోయింది. ఈమె ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో మొత్తం రష్మిక నే కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: