అవును.. మీరు విన్నది అక్షరాలా నిజం. ఆ స్టార్ హీరో మరెవరో కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అప్పట్లో రవితేజ సినిమా కెరీర్ని మలుపు తిప్పిన సినిమాలు ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రాలు. ఈ రెండు సినిమాలు రవితేజను మాస్ హీరోని చేసాయి. అయితే ఈ చిత్రాలు డైరెక్టర్ పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ కోసం, ప్రతీ సన్నివేశాన్ని ఆయన్ని ఊహించుకునే రాశాడట. దాంతో ఈ స్టోరీలు పవర్ స్టార్ కి వినిపించగా ఎందుకో రిజెక్ట్ చేశాడట. అలా రిజెక్ట్ చేసిన సినిమాలు రవితేజ చేతుల్లోకి రాగా ఈ రెండు చిత్రాల తర్వాత మళ్ళీ ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. చూస్తుండగానే స్టార్ హీరో గా ఎదిగిపోయాడు.
అలాంటి రవితేజ ఈమధ్య కాలంలో మాత్రం కొంతమంది కొత్త డైరెక్టర్స్ ని నమ్మి తన కెరీర్ ని నాశనం చేసుకుంటున్నాడని విమర్శలు వస్తున్నాయి. ధమాకా తర్వాత ‘మిస్టర్ బచ్చన్’ చిత్రాన్ని మినహాయిస్తే, మిగిలిన సినిమాలన్నీ కొత్త డైరెక్టర్స్ తో చేసినవే కావడం గమనార్హం. కాగా అవన్నీ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. దాంతో మినిమం గ్యారంటీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న రవితేజ, ఇప్పుడు ఆ బ్రాండ్ ఇమేజ్ ని మెల్లిగా తగ్గించేసుకున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు కచ్చితంగా ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా చేయాలని మాస్ మహారాజ్ అభిమానులు కోరుకుంటున్నారు. ఆ బ్లాక్ బస్టర్ ‘మాస్ జాతర’ రూపంలో త్వరలోనే రాబోతుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. చూడాలి మరి.. ఏమవుతుందో?