విషయం ఏమిటంటే, విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కారణంగానే ఈ సినిమా తరువాత సినిమాలకు పూర్తిగా గుడ్ బాయ్ చెప్పనున్నాడు. 200 కోట్ల పారితోషికం తీసుకునే నటుడు విజయ్ ఆస్తి విలువ ప్రస్తుతం 400 నుండి 600 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక ఆయన భార్య సంగీత కూడా భారీగా ఆస్తులు కలిగి ఉన్నారని టాక్ నడుస్తోంది. 1999 ఆగస్టు 25న విజయ్ - సంగీత వివాహం చేసుకున్నారు. విజయ్, సంగీతల వివాహం జరిగి 23 ఏళ్లు పైనే కాబోతోంది. విజయ్ తమిళ కళగం అనే రాజకీయ పార్టీని ప్రారంభించడంతో, ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆయనకు బదులుగా ఆయన భార్య సంగీత హాజరవుతున్నారు.
పార్టీ ప్రారంభించడానికి ముందు కేవలం ఆడియో వేడుకల్లో మాత్రమే పాల్గొన్న సంగీత ఇప్పుడిప్పుడే బయటకి రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో సంగీత ఆస్తి విలువ ఎంత అనే దాని గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు సంగీత ఆస్తి విలువ 400 కోట్లు ఉందని ఓ మీడియా తెలిపింది. అయితే ఆమె చేసే పనులు గురించి మాత్రం వివరాలు ఏమీ ఇంకా తెలియవు. ఆమె తండ్రి లండన్లోని కోటీశ్వరుల్లో ఒకరట. ఇక ఎక్కువగా కార్లను ఇష్టపడే విజయ్ ఆడి, BMW, లెక్సస్ వంటి అనేక లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. చెన్నై నీలాంగరైలో లగ్జరీ ఇల్లు ఉండగా, తిరువళ్లూర్, తిరుపోరూర్, తిరుమజిసై, వండలూర్ వంటి ప్రాంతాల్లో అనేక ఆస్తులు ఉన్నాయని చెబుతున్నారు.