మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘వార్‌ 2’ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో, హిందీ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రెండు ఇండస్ట్రీలకు చెందిన ఇద్దరు పాపులర్ స్టార్స్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.అదేమిటంటే వార్2లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పాత్రలను పరిచయం చేయడానికి స్టార్ హీరోలు గొంతు విప్పనున్నారట. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు తన వాయిస్ ఓవర్ తో ఈ పాత్రలను పరిచయం చేయనున్నట్టు తెలుస్తోంది.

ఇక హిందీలో ఆ పాత్రలను పరిచయం చేయడానికి స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ రంగంలోకి దిగుతున్నాడట. మూవీలో హీరోల క్యారెక్టర్ గురించి కొన్ని చోట్ల వాయిస్ ఓవర్ వస్తుందని, సినిమాలో ఆ వాయిస్ ఓవర్ ఎంతో కీలకమని తెలుస్తోంది.ఇదిలావుండగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే చాలా సినిమాలకు తన వాయిస్ ఓవర్ ను ఇచ్చారు. జల్సా సినిమాలో హీరో పాత్రను పరిచయం చేసిన మహేష్ బాబు, రీసెంట్ గా ముఫాసా లయన్ కింగ్ సినిమాకు కూడా తన వాయిస్ ఓవర్ ను అందించారు. ముఫాసాకు కేవలం వాయిస్ ఓవర్ ఇచ్చినందుకే మహేష్ బాబు థియేటర్ల దగ్గర ఆయన ఫ్యాన్స్ ఫ్లెక్సీలను పెట్టిన విషయం తెలిసిందే.


ఈ నేపథ్యంలో ఇప్పుడు వార్2కు వాయిస్ ఓవర్ ఇస్తే ఇక ఆయన ఫ్యాన్స్ హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలే ఎన్టీఆర్, మహేష్ మధ్య మంచి అనుబంధముంది.ఇదిలావుండగా సినిమా విషయానికొస్తే జూనియర్ ఎన్టీఆర్ - హృతిక్‌ రోషన్ ల కాంబినేషన్ లో ఓ సాంగ్ ను చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని బీటౌన్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఎన్టీఆర్, హృతిక్ లు ఎంత మంచి డ్యాన్సర్స్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ సినిమాలోని బెస్ట్ డ్యాన్సర్స్ లిస్టు తీస్తే, వీరిద్దరి పేర్లు ఖచ్చితంగా టాప్ లో ఉంటాయి. ఒకరు తన మాస్ స్టెప్పులతో అదరగొడితే, మరొకరు స్టైలిష్ డ్యాన్స్ మూవ్స్ తో ఇరగదీస్తారు. అలాంటి ఇద్దరు స్టార్ హీరోలు ఒకే పాటకు డ్యాన్స్ చేయడం అంటే ఆడియన్స్ కు విజువల్ ట్రీట్ అనే చెప్పాలి. ఇప్పుడు ‘వార్‌ 2’ సినిమా కోసం ఆ ప్రయత్నమే జరుగుతున్నట్లు తెలుస్తోంది. హృతిక్‌ - తారక్‌ లపై ఓ మాస్ మసాలా సాంగ్ ను షూట్ చేస్తారని సమాచారం అందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: