టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఐశ్వర్య రాజేష్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రం రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్లు గా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించారు. అయితే ఈ సందర్బంగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఐశ్వర్య రాజేష్ తెలుగు అమ్మాయి. అందుకే ఈ సినిమాలో ఆమె చాలా బాగా నటించింది. చాలా మంది హీరోయిన్ లు ముగ్గురు పిల్లలకు తల్లిలా చేయము అని నో చెప్పారు. కానీ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ సినిమా స్టోరీ వినగానే.. మంచి హిట్ అవుద్దీ అంటూ ఒకే చెప్పేసింది. ఈమె తెలుగు అమ్మాయి అయినందు వలన సీనియర్ హీరోయిన్లు సౌందర్య, మీనా లాగా చాలా బాగా నటించింది' అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు.
ఇక అనిల్ రావిపూడి విషయానికి వస్తే.. ఇలాంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు బాగా తీస్తారు. అందులోనూ ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహ పడానివ్వడు. తనదైన శైలిలో సినిమాలు తీస్తూ అనిల్ రావిపూడి ఫ్యామిలీ డైరెక్టర్ గా నిలిచారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు భీమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. 18 ఏళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్, రమణ గోగుల కాంబో మళ్లీ వచ్చిన సినిమా ఇది. బ్లాక్‌బస్టర్ లక్ష్మి కోసం వెంకటేష్‌తో కలిసి పని చేసిన రమణ గోగుల ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ సింగిల్‌కి తన వాయిస్ ని అందించారు. ఇక సంక్రాంతికి కానుకగా విడుదల అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 200 కోట్ల కాలక్షన్ ఈ సినిమా వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: