నందమూరి బాలకృష్ణ - జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న సంబంధం గురించి జనాలకు ఇక్కడ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందివారు అయినప్పటికీ ఇద్దరి భావజాలాలు వేరు వేరుగా ఉంటాయి. పర్సనల్ గా వారిమధ్య రిలేషన్ ఎలా ఉన్నప్పటికీ, బయట మాత్రం వారిమధ్య దూరం ఉందంటూ రూమర్స్ మనకి వినబడుతూ ఉంటాయి. ఇలాంటి తరుణంలో సరిగ్గా 2 రోజుల క్రితం బాల బాబాయ్ అంటూ అబ్బాయి నోటి నుంచి వచ్చిన పిలుపు నందమూరి అభిమానులకు కిక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ ప్రకటించిన ప్రకటించిన సందర్భంగా తారక్ శుభాకాంక్షలు తెలియజేసాడు. ఈ క్రమంలోనే బాల బాబాయ్ అంటూ జూనియర్ ఆప్యాయంగా పలకరించడంతో తారక్ నందమూరి కుటుంబంతో సఖ్యతకు ప్రయత్నిస్తున్నాడు అన్న ప్రచారం మొదలైంది.

ఈ పరిణామం తరువాత నందమూరి కుటుంబమంతా ఏకతాటిపైకి రావాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. ఇకపోతే చాలా రోజులుగా ఈ ఇద్దరూ ఒకే వేదికపై కనబడడం జరగలేదు సరికదా, బయట ఫంక్షన్లలో కూడా కనబడడం అరుదు. కానీ బాబాయికి పద్మభూషణ్ అవార్డు ప్రకటించడంతో అబ్బాయి స్పందించడంతో నందమూరి అభిమానుల కళ్ళల్లో ఆనందం తాండవిస్తోంది. అయితే దీనిపై బాలకృష్ణ ఇంతవరకు రిప్లై ఇవ్వకపోవడం గమనార్హం. బాలయ్య నందమూరి తారక రామారావు బయోగ్రఫీతో నాయకుడు, కథానాయకుడు చిత్రాల్లో బాలకృష్ణ నటించినంతవరకు తారక్ బాబాయ్ బాలయ్యతో మంచి సంబంధాలే కొనసాగించారు. ఆ చిత్రాలకు సంబంధించి ఫంక్షన్లకు తారక్ హాజరయ్యారు. ఆ తరువాత వారిద్దరి మధ్య దూరం స్టార్ట్ అయిందనే రూమర్స్ నడుస్తున్నాయి.

అయితే కొంతమంది విశ్లేషకులు మాత్రం ఇద్దరూ ఒకే కుటుంబం అని, ప్రతిసారీ జనాలకి వారు కలిసి ఉన్నాము అంటూ నిరూపించుకోవాల్సిన అవసరం లేదంటూ సమాధానం చెబుతున్నారు. ఇక ఇటీవల ఎన్నికల్లో టిడిపి కూటమి ఘన విజయం సాధించగా చంద్రబాబు, లోకేష్ లతో పాటు బాలకృష్ణ కు సైతం అభినందనలు తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. దీనిపై చంద్రబాబుతో పాటు లోకేష్ రిప్లై ఇవ్వగా బాలకృష్ణ నుంచి ఎటువంటి స్పందన లేదు. అదేవిధంగా బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి దాదాపు అగ్ర కథానాయకులంతా హాజరయ్యారు. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ తప్ప! కాగా బాలకృష్ణ వ్యవహార శైలి చూస్తుంటే ఇపుడు అందర్నీ కలుపుకునే తత్వం కనిపిస్తోంది. ఈ సమయంలో తారక్ నుంచి స్పందన రావడంతో తప్పకుండా బాలకృష్ణ కలుపుకొని వెళ్తారని నందమూరి అభిమానులు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: