నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున గురించి జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమకు నాలుగు దిక్కులు ఉంటే, అందులో రెండు దిక్కులు వీరిద్దరే అని చెప్పుకోవచ్చు. అలాంటి వీరిద్దరూ కలిసి బయట కనబడడం చాలా అరుదనే చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే వీరిరువురి కుటుంబాల మధ్య అంతగా సన్నిహిత సంబంధాలు లేవనే పుకార్లు మనకు వినబడుతూ ఉంటాయి. అయితే ఈ దూరం ఈనాటిది కాదు. అప్పటి సీనియర్స్ ఎన్టీఆర్ - ఏన్నార్ నుండే కొంత దూరం ఉందనేది వినికిడి.

ఇక తాజా ప‌రిణామాల‌తో మరోసారి వీళ్ళిద్దరి వివాదం సోషల్ మీడియాలో హ‌ట్ టాపిక్‌గా మారింది. విషయం ఏమిటంటే, బాలయ్యకు తాజాగా ప్రతిష్టాత్మక పద్మభూషణ్‌ అవార్డు దక్కిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేప‌ద్యంలో బాలకృష్ణకు ఇండస్ట్రీ నుంచి చాలామంది విషెస్ తెలియజేసారు. సినీ పరిశ్రమకు బాలయ్య చేసిన సేవలకు, రాజకీయంగా ప్రజలకు అందించిన ఎనలేని సేవలకు మంచి గుర్తింపు వచ్చిందంటూ అభివ‌ర్ణిస్తూ ప్ర‌సంస‌లు కురిపించారు. ఈ క్రమంలో చిరంజీవి, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మోహన్ బాబు, మహేష్, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, చరణ్, రవితేజ ఇలా ప్రతి ఒక్కరూ విషెస్ తెలియజేయగా నాగార్జున మాత్రం ఇప్పటివరకు బాలయ్యకు విషెస్ చెప్పకపోవడం కొసమెరుపు. ఈ క్రమంలోనే అనేక రూమర్స్ వినబడుతున్నాయి.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ దాదాపుగా ఒకే జెనరేషన్ కి చెందినవారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోలుగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే వీరిలో అత్యున్నత పురస్కారాలు మాత్రం చిరంజీవి, బాలయ్యలకు మాత్రమే వ‌రించాయి. మోహన్ బాబు ఒక్కడికి మాత్రం పద్మశ్రీ దక్కింది. వెంకటేష్, నాగార్జునల‌కు అయితే ఎటువంటి పద్మ అవార్డులు దక్కలేదు. ఈ క్రమంలోనే తమ పట్ల చిన్నచూపుతోనే తమకు ఎలాంటి గౌరవం ఇవ్వడం లేదని.. తమకు సరైన గుర్తింపు రావడం లేదని ఆలోచనతోనే నాగార్జున బాలయ్యకు విషెష్ తెలియజేయలేదని గుసగుసలు వినబడుతున్నాయి. అయితే నాగార్జున గతంలో అవార్డులు అందుకున్న వాళ్లకు కూడా ఎలాంటి విషెస్ చెప్పకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: