పద్మా అవార్డు గ్రహితలను అభినందిస్తూ రాజమౌళి తెలుగు ఇంగ్షీషు పదాలను కలపోస్తూ తన సోషల్ మీడియా ఎకౌంట్ లో ఒక కామెంట్ పెట్టాడు. ‘7 తెలుగు పీపుల్స్ థిస్ టైం’ అంటూ ఆయన అభినందన సందేశం కొనసాగింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ సంవత్సరం ‘పద్మా’ అవార్డులు పొందిన వారు 7గురు కావడంతో ‘7 తెలుగు పీపుల్స్ థిస్ టైం’ అని కామెంట్ పెట్టి ఉంటాడు.
అయితే భారీ తెలుగు సినిమాలు తీస్తూ తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో సెలెబ్రెటీగా కొనసాగుతున్న ప్రముఖ దర్శకుడు రాజమౌళి కొంతవరకు తెలుగు ఇంగ్షీషు పదాలను కలపోస్తూ ఇలాంటి కామెంట్స్ పెట్టి ఉంటాడు అని జకకాన్న అభిమానులు భావిస్తున్నప్పటికీ అనవసరంగా తన దర్శకుడు అనాలోచితంగా చేసిన తన మాటలకు టార్గెట్ అవుతున్నాడు అనుకోవాలి. ప్రస్తుత తరం ప్రఖ్యాత దర్శకుడైన రాజమౌళి పశ్చిమగోదావరి జిల్లా అయిన కొవ్వూరు ప్రాంతానికి చెందిన వాడు.