దంగల్ సినిమా గురించి, అందులో నటించిన నటీమణులు గురించి జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డులు నమోదు చేసింది. ఇక ‘దంగల్’లో అమీర్ కూతురి పాత్రలో నటించిన ఫాతిమా సనా షేక్ అందరికీ తెలిసే ఉంటుంది. ఆమె ‘దంగల్’ సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకుంది. కాగా ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి మాట్లాడి అందరికీ షాక్ ఇచ్చింది. దక్షిణాది సినిమా పరిశ్రమలో ఒక డైరెక్టర్ తనను కమిట్మెంట్ అడిగాడంటూ సంచలన వ్యాఖ్యలు చేయగా ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... "సౌత్ ఇండియన్ సినిమాల్లో నటిస్తే, బాలీవుడ్‌లో మంచి ఆఫర్లు వస్తాయని టాక్ ఉంది. ఆ కారణంతోనే నేను కొన్ని సౌత్ ఇండియన్ సినిమాల్లో నటించాలని అనుకున్నాను. కానీ అక్కడ నాకు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌లో సినిమా ఆడిషన్ ఉంటుందని, ప్రొఫైల్ పంపమని నా స్నేహితుడు చెప్పగా ఫోటోలు పంపాను. తరువాత ఓ వ్యక్తి నాకు ఫోన్ చేసి వ్యక్తి ‘ఈ పాత్ర కోసం మీరు ఏం చేయడానికైనా సిద్ధమా? అని అడిగాడు. అతని ఉద్దేశం నాకు అర్థమైంది. కానీ, అర్థం కానట్టు, ‘ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డాను. పాత్రకు కావాల్సినంత పని చేస్తాను’ అని అన్నాను. కానీ అతను ఆ విషయమై పదేపదే అడుగుతూనే ఉన్నాడు ‘ఏదైనా చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని!’ దాంతో నేను కూడా అతని ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోలేని విధంగా మాట్లాడాను. దాంతో అతను చిరాకుపడి ఫోన్ కట్ చేసాడు!" అని ఫాతిమా తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది.

దాంతో ప్ర‌స్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట‌ వైరల్‌ అవుతున్నాయి. ఫాతిమా సనా షేక్ ‘నువ్వు నేను ఒక్కటౌదాం’ అనే తెలుగు సినిమాలో నటించగా ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత ఫాతిమా తెలుగులో మరే సినిమాలోనూ నటించలేదు. ఫాతిమా ప్రస్తుతం 3 హిందీ సినిమాల్లో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: