గతంలో వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్యకు చెల్లెలుగా నటించిన వరలక్ష్మి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయం పైన యాంకర్ ప్రశ్నించగా తాను బాలయ్యతో మాట్లాడానని అంతేకాకుండా తన భర్త కూడా ఆయనకు పెద్ద ఫ్యాన్ అని ఇటీవలే రీసెంట్గా ఇద్దరు కలిసి మాట్లాడి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశామంటూ తెలిపింది వరలక్ష్మి శరత్ కుమార్. బాలకృష్ణకు ఈ అవార్డు రావడానికి అర్హత ఉన్నది అంటూ తెలిపారు..ఆయన సినీ కెరియర్ పక్కన పెడితే ఎంతోమందికి సహాయం చేస్తూ ఉన్నారని అలాగే క్యాన్సర్ వచ్చిన వాళ్లకు ఎంతో చేశారని తెలిపింది.
సినీ కెరియర్ అందరికీ ఉంటుంది కొన్నిసార్లు కలిసి వస్తుంది మరి కొన్నిసార్లు రాదు కానీ ఇంకో మనిషికి సహాయం చేయాలి అంటే కచ్చితంగా గొప్ప మనసు ఉండాలి అని అది బాలకృష్ణకి ఉండడం వల్లే ఆయనకు ఇలా మంచి జరుగుతోంది అంటూ తెలియజేసింది వరలక్ష్మి శరత్ కుమార్. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారడంతో ఈ వీడియో చూసిన అభిమానులు అన్నయ్యను ప్రశంశలతో చెల్లెలు పొగిడేస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అఖండ 2 చిత్రంలో బాలయ్య నటిస్తూ ఉన్నారు ఇందులో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తూ ఉన్నది.