
సాయి పల్లవి, నాగచైతన్య కెమిస్ట్రీ కూడా ఇందులో హైలెట్గా ఉండేలా కనిపిస్తోంది. ఊర్లో వారందరూ కూడా శివరాత్రికి నాగచైతన్యాన్ని తండేల్ గా ఎన్నుకోవడం జరుగుతుంది. దీంతో ఈసారి వేటకు వెళ్లాలని సూచించగా హీరోయిన్ వద్దని చెప్పడం అయినా వేటకి వెళ్లడం అనుకోకుండా పాకిస్తాన్ జవాన్లకు చిక్కడం వంటివి చూపించారు.. అలాగే ఇందులో దేశభక్తిని చాటిచెప్పేలా చూపించినట్టు కనిపిస్తోంది. పాకిస్తాన్ కి వెళ్లి ఒక ఇండియన్ ఎలా అక్కడినుంచి బయటపడ్డాడు అనే కథాంశంతో తెరకించినట్లు కనిపిస్తోంది.
ఈ సినిమా శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన మత్స్యకారుల రియల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించినట్లు సమాచారం. ఈ సినిమాని కూడా శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కించారు చిత్ర బృందం. ఇందులోని యాక్షన్ సన్నివేశాలు కూడా హైలెట్ గానే కనిపిస్తున్నాయి. నాగచైతన్య యాక్టింగ్, సాయి పల్లవి యాక్టింగ్ కూడా ఇందులో అంతకు మించి ఉందనేలా చెప్పవచ్చు.. మొత్తానికి ట్రైలర్ తో కూడా మంచి హైప్ తీసుకోవచ్చారు చిత్ర బృందం. ముఖ్యంగా నాగచైతన్య చెప్పే డైలాగులు కూడా ఈ సినిమాకి కాస్త హైలైట్ గా ఉన్నాయి. మరి ఏ మేరకు ఈ సినిమాతో నాగచైతన్య సక్సెస్ అందుకుంటారో చూడాలి మరి. ఇప్పటికే అల్లు అరవింద్ కూడా నాగచైతన్య కెరియర్ లోని బెస్ట్ సినిమా అవుతుందని తెలియజేశారు.