విశ్వక్సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెళ్ళిపోమాకే సినిమాతో 2017లో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హీరో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనంతరం ఎన్నో సినిమాలలో నటించి అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ హీరో నటించిన తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో విశ్వక్సేన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం విశ్వక్సేన్ "లైలా" అనే మరో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో అభిమానుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. 


ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో విశ్వక్సేన్ లుక్ ను చిత్ర బృందం రివ్యూ చేశారు. ఇందులో విశ్వక్సేన్ మొదటిసారి తన కెరీర్ లో లేడీ గెటప్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. లేడీ గెటప్ లో విశ్వక్సేన్ ని చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఇంత అందంగా ఉన్నాడేంటి అసలు విశ్వక్సేన్ ఏనా అనేంతలా అందంగా ఉన్నాడు. అయితే తాజాగా విశ్వక్సేన్ ఈ సినిమాలో తాను లేడీ గెటప్ లోకి మారడానికి ఎంత కష్టపడ్డాడో చిత్ర బృందం మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ మేకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. 


లేడీ క్యారెక్టర్ కోసం విశ్వక్సేన్ చాలా కష్టపడినట్లుగా తెలుస్తోంది. లైలాగా కనిపించడం కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నాడు. కాగా, ఈ గెటప్ గురించి విశ్వక్సేన్ తాజాగా స్పందించారు. ఆ గెటప్ లో మా నాన్నకి ఫోన్ చేస్తే నన్ను అసలు గుర్తు పట్టలేకపోయానని విశ్వక్సేన్ అన్నారు. తన జీవితంలో లైలా పాత్ర మెమోరబుల్ గా ఎప్పటికీ మిగిలిపోతుందని విశ్వక్సేన్ అన్నారు. 


ముంబైలో ఫిల్మ్ స్కూల్ లో ఉన్న సమయంలో కుంతీ రోల్ చేశానని విశ్వక్సేన్ గుర్తు చేసుకున్నాడు. భవిష్యత్తులో ఎలాంటి క్యారెక్టర్లు చేసినా కూడా లైలా రోల్ మాత్రం చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుందని అన్నాడు. కాగా ఈ సినిమాలో విశ్వక్సేన్ అసలు అమ్మాయిలాగా ఎందుకు మారాడు అన్న విషయాన్ని సినిమా చూసి తెలుసుకోవాలని మేకర్స్ అన్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: