నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించినటువంటి తాజా చిత్రం తండేల్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించగా అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 7వ తేదీన భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి కావలసినంత ప్రమోషన్స్ అయితే లభించాయి. నిన్నటి రోజున చిత్ర బృందం ట్రైలర్ ని కూడా వైజాగ్లో విడుదల చేశారు. అలాగే వైజాగ్లో శ్రీరామ పిక్చర్ ప్యాలెస్ లో గ్రాండ్గా ఒక ఈవెంట్ ని కూడా అభిమానుల మధ్య ఒక వేడుకగా చేశారు.


అయితే ఈ వేడుకకి హీరో నాగచైతన్య కూడా హాజరయ్యారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నాగచైతన్య ఇలా మాట్లాడుతూ.. మన పుష్ప కా బాప్ అల్లు అరవింద్ గారు ఏడాది నుంచి తన లైఫ్లో నిజమైన తండేల్ గా మారారని తెలిపారు.. సినిమా చివరికి వచ్చేసరికి ఆయన లేకపోతే తాను సినిమా ఎలా చేయగలను అనే ఫీలింగ్ కూడా వచ్చేసిందని తెలిపారు. ఈ చిత్రంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ,గైడెన్స్ చాలా విలువైనది అంటూ తెలియజేశారు. తన జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటానని వెల్లడించడం జరిగింది చైతన్య.



అలాగే వైజాగ్ విషయానికి వస్తే ఏ సినిమా రిలీజ్ అయిన కూడా వైజాగ్ టాక్ ఏంటి అన్నదే ఖచ్చితంగా కనుక్కుంటామని ఇక్కడ సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆడాల్సిందే అని తెలిపారు.. వైజాగ్ తనకు ఎంత క్లోజ్ అంటే తాను ఇక్కడ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాననీ తన ఇంట్లో రూలింగ్ అంత వైజాగ్ వాళ్ళదే అంటూ.. కాబట్టి మీకో రిక్వెస్ట్.. తండేల్ చిత్రాన్ని వైజాగ్ కలెక్షన్స్ తో షేక్ చేయాలి లేకపోతే ఇంట్లో తన  పరువు పోతుంది అంటూ నాగచైతన్య నవ్వుతూ చెప్పారు. ఈ పాలి మాట తప్పేదే లేదు ఇచ్చిన మాట ప్రకారం ఫిబ్రవరి  7న థియేటర్లలో రాములమ్మ జాతర అంటూ డైలాగ్ చెప్పారు నాగచైతన్య.

మరింత సమాచారం తెలుసుకోండి: