ఏ సిని ఇండస్ట్రీలోనైనా సరే మహిళలకు వేధింపులు అనేది ఎన్నో ఏళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయాన్ని చాలామంది ఇప్పటికే ఎన్నో సందర్భాలలో బహిరంగ చెప్పగా మరికొంతమంది సైలెంట్ గా ఉన్నారు. ఈ కాస్టింగ్ కౌచ్ అనేది కొన్ని ఏళ్లుగా వస్తూనే ఉంది.. హీరోయిన్స్ నుంచి మొదలు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా ఎన్నో సందర్భాలలో చాలామంది తెలియజేశారు.. ఇటీవలే ఒక తెలుగు నటి కమిట్మెంట్ ఇచ్చిన కూడా ఆఫర్స్ రావడం లేదంటూ తెలియజేసిందట. మలయాళ చిత్రంలో హేమ కమిటీ ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు.


అయితే ఇప్పుడు తాజాగా ఒక బాలీవుడ్ హీరోయిన్ తమ జీవితంలో ఎదురైనా ఒక లైంగిక వేధింపుల గురించి పలు విషయాలను తెలిపింది. ఆమె ఎవరో కాదు ఫాతిమా సనా షెక్.. దంగల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈమె అమీర్ ఖాన్ కూతురుగా ఇందులో నటించింది. ఈ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇమే తాజాగా కాస్టింగ్  కౌచ్ గురించి ఒక విషయాన్ని వెల్లడించింది. సినిమా అవకాశాల కోసం ఒక తెలుగు నిర్మాతను కలిసినప్పుడు తనతో చాలా విచిత్రంగా ప్రవర్తించిన తీరు తనకి ఆశ్చర్యాన్ని కలిగించింది అంటూ తెలిపింది ఫాతిమా సన షేక్.


మీకు అవకాశం కావాలి అంటే ప్రతి పనిని చేయాల్సి ఉంటుంది.. ఏ పని అయినా సరే అంగీకరించాలి..రాత్రికి రమ్మని నేరుగా అడుగుతారు అంటూ నిర్మాత తనతో ఓపెన్ గానే చెప్పారని వెల్లడించింది సనా. అయితే సినిమాల్లో తాను ఏ పాత్రలు చేయడానికి అయినా సిద్ధంగానే ఉన్నాను కానీ ఇలాంటి పని చేయానని చెప్పి అక్కడ నుంచి తిరిగి వచ్చేసానని తెలియజేసింది సనా షేక్. అయితే ఈమె తెలుగులో నటించింది నువ్వు నేను ఒకటవుదాం అని చిత్రంలో అలరించింది. అయితే ఆ నిర్మాత పేరు మాత్రం బయట పెట్టలేదు ఫాతిమా సనా.

మరింత సమాచారం తెలుసుకోండి: