లైంగిక వేధింపుల కమిటీలో కీలకమైన సభ్యురాలుగా ఉన్నటువంటి యాంకర్ ఝాన్సీ.. తన సోషల్ మీడియాలో ఇలా తెలియజేస్తూ.. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక కేసు గెలిచినట్టుగా అనిపిస్తోందని వెల్లడించింది.. పనిచేసే ప్లేసులో లైంగిక వేధింపులు జరిగినట్లు ప్రూఫ్ అయిన తర్వాత కూడా ఫిలిం ఛాంబర్ ఇచ్చినటువంటి ఆర్డర్లకు సైతం వ్యతిరేకంగా డిస్టిక్ కోర్టుని ఆశ్రయించడం జరిగింది జానీ మాస్టర్ . అయితే ఈ కేసును సైతం కోర్టు తోసిపుచ్చినట్లుగా తెలియజేసింది.
కోర్టు తీసుకున్న నిర్ణయం పని ప్రదేశాలలో మహిళలకు ఎంత సేఫ్గా ఉండేదే ముఖ్యమని మరొకసారి చాటి చెప్పింది అంటూ ఝాన్సీ వెల్లడించింది. అలాగే ప్రతి సంస్థలో కూడా..POSH రూల్స్ కచ్చితంగా ఉండాల్సిందే అని మరొకసారి కోర్టు చాటి చెప్పింది అంటూ లైంగిక వేధింపుల కమిటీలో కీలక సభ్యురాలు అయిన ఝాన్సీ తెలియజేసింది. ఈ విషయాన్ని ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ తో కూడా కలిసి పోరాడుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టుని అయితే ఝాన్సీ తెలియజేసింది. జానీ మాస్టర్ పిటీషన్ ని కోర్టు కొట్టివేయడంతో చాలా ఆనందంగా ఉంది అంటూ ఆమె పోస్ట్ షేర్ చేసింది.