ఈ మధ్యకాలంలో స్టార్ బ్యూటీస్ బడాబడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అందాల ముద్దుగుమ్మలు అందరూ  కూడా బ్యాక్ టూ బ్యాక్ పెళ్లిళ్లు చేసుకుని లైఫ్లో సెటిల్ అయిపోతూ ..వెంటనే తమ లైఫ్ కి సంబంధించిన గుడ్ న్యూస్ లు కూడా వినిపించేస్తున్నారు. కాగా రీసెంట్ గానే టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పాపులారిటి సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ సైతం పెళ్లి చేసుకొని ఓ ఇంటిది అయిపోయింది.  ప్రజెంట్ తన భర్తతో ఒక పక్క లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే మరొక పక్క వచ్చిన సినిమాలకు సైన్ చేస్తూ బిజీగా ముందుకు వెళ్తుంది .


కాగా ఇలాంటి క్రమంలోనే  నెక్స్ట్ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోబోయే హీరోయిన్ ఎవరు అనే విషయం బాగా ట్రెండ్ అవుతుంది. అయితే ఇప్పటివరకు కమిటెడ్ అయినా హీరోయిన్స్ లలో ఆ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉంది తమన్నా అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు.  తమన్న కి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన ఎవరు అనేది కూడా అందరికి తెలుసు. బాలీవుడ్ నటుడు విజయవర్మ . వీళ్ల ప్రేమ-డేటింగ్ ఇంట్లో వాళ్లకి కూడా తెలుసు.వీళ్లకి సంబంధించిన పిక్స్ ఎలా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి అనేది కూడా అందరికి తెలుసు.



అంతా కలిసి వస్తే ఆమె ఈ ఏడాదిలోనే పెళ్లి పీటలు ఎక్కేస్తుంది.  పైగా తమన్నా ఖాతాలో చెప్పుకోతగ్గ సినిమాలు లేవు . ఆమె ఫ్యాన్ బేస్ కూడా మెల్లమెల్లగా పడిపోతుంది.  ఈ క్రమంలోనే అటు ఫ్యామిలీ పరంగా ఇటు ఫ్యాన్ బేస్ పరంగా చూస్తే తమ్మన్నానే నెక్స్ట్ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోబోయే హీరోయిన్ అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది. చూద్దాం మరి తమన్నా గుడ్ న్యూస్ ఎప్పుడు వినిపిస్తుందో..? ఫాన్స్ ఆ మూమెంట్ కోసం బాగా వెయిట్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: