ఉదయ్ కిరణ్ .. ప్రజెంట్ మన మధ్య లేకపోయినా సరే అభిమానుల గుండెల్లో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి అభిమానాన్ని సంపాదించుకున్నాడు . ఉదయ్ కిరణ్ చేసింది చాలా తక్కువ సినిమాలు . ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోగా మారిపోయి బడా బడా స్టార్ హీరోలకి కూడా కాంపిటీషన్ ఇస్తూ అమ్మాయిలతో లవర్ బాయ్ అంటూ పిలిపించుకున్నాడు.  అప్పట్లో స్టార్ హీరోల కూతుర్లు అందరూ కూడా ఉదయ్ కిరణ్ కి బిగ్ ఫ్యాన్స్ అని చెప్పడంలో సందేహమే లేదు.


అలాంటి ఒక్క నటనను ఆయన స్క్రీన్ పై చూపించి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు . అలాంటి ఉదయ్ కిరణ్ ఎలా సూసైడ్ చేసుకొని మరణించాడు అన్న విషయం అందరికీ తెలుసు.  కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటారు .. మరి కొంతమంది ఫ్యామిలీ ఇష్యూస్ అంటారు . రీజన్ సరిగ్గా బయటపడినప్పటికీ టాలెంటెడ్ ఉదయ్ కిరణ్ మాత్రం మన మధ్య లేకుండా వెళ్ళిపోయాడు . అయితే ఉదయ్ కిరణ్ లో ఒక మంచి గుణం ఉంది . తనని తిట్టిన తన పట్ల దురుసుగా  ప్రవర్తించిన.. తన పట్ల హెల్పింగ్ నేచర్ లేకపోయినా.. ఆయన మాత్రం అందరితో సరి సమానంగా కలివిడిగా ఫ్రెండ్లీగా ముందుకు వెళుతూ ఉంటాడు.



ఆయన మనసుకు హర్టింగ్ అనిపించిన ఎక్కడా కూడా రూడ్ గా మాట్లాడిన మూమెంట్స్ లేవు . అలాంటి ఒక రేర్ క్వాలిటీ ఉదయ్ కిరణ్ కి ఉంది.  అయితే ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఉండే హీరోస్ కి ఎంత కోపం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు . కొందరు స్టేజిపై ని కళ్ళు ఉరుముతూ మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాం . కాగా ఒకే ఒక్క హీరో మాత్రం ఉదయ్ కిరణ్ కి ఉండే  ఆ మంచి గుణం ఉంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . ఆయన మరెవరో కాదు పాన్ ఇండియా హీరో ప్రభాస్.  ప్రభాస్ ఫ్రెండ్షిప్ కి చాలా వాల్యూ ఇస్తాడు . ప్రభాస్ చాలా చాలా నెమ్మదస్తాడు . తనకు కోపం తెప్పించే విషయమైనా సరే కూల్ గా సాల్వ్ చేసేస్తాడు . ఒక అప్పట్లో ఉదయ్ కిరణ్ లో ఎలాంటి క్వాలిటీ ఉండిందో ఇప్పుడు రెబల్ హీరోలో కూడా అదే క్వాలిటీ ఉంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: