కొంతమంది నటీనటులు ఎక్కడ మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అని తెలియకుండానే అప్పుడప్పుడు నోరు జారుతూ ఉంటారు.అలా తాజాగా ఓ ఇద్దరి హీరోయిన్లు కూడా నోరు జారి నిర్మాత పరువు స్టేజి మీదే తీసేశారు.మరి ఇంతకీ ఆ హీరోయిన్స్ అంటే అంజలీ, వరలక్ష్మి శరత్ కుమార్.. అంజలి,వరలక్ష్మి శరత్ కుమార్ ఇద్దరు హీరోయిన్లుగా విశాల్ హీరోగా చేసిన తాజా మూవీ మదగద రాజా..ఈ సినిమా దాదాపు 12 సంవత్సరాలకు ముందే షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చి చివరికి  ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా ఇప్పటికే 40 కోట్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. అయితే తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన మదగదరాజని తెలుగులో కూడా రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ అనుకొని ఈ నెల 31న ఈ సినిమాని తెలుగులో విడుదల చేయడానికి అన్ని పనులు పూర్తి చేశారు.

 అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి న ఓ ఈవెంట్లో అంజలి,వరలక్ష్మి శరత్ కుమార్ లు స్టేజ్ మీదే నిర్మాత పరువు తీశారు.మరి ఈ ఇద్దరు హీరోయిన్లు కలిసి నిర్మాత పరువు ఎలా తీసారంటే .. తెలుగులో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. కాబట్టి తెలుగులో కూడా ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ మొదలెట్టేశారు. అయితే తాజాగా ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో స్టేజ్ మీద వరలక్ష్మి శరత్ కుమార్ అంజలి ఇద్దరు కలిసి మీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది కానీ మీరు మాకేమైనా రెమ్యూనరేషన్ పెంచుతున్నారా.. అంటూ నిర్మాత పరువు తీశారు.

ఇక స్టేజ్ మీదే పరువు తీయడంతో నిర్మాత ఏం మాట్లాడాలో తెలియక చాలా సమయస్పూర్తిగా ఆలోచించి తెలుగులో ఈ సినిమా గనక హిట్ అయితే కచ్చితంగా మీకు రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తాను అంటూ చెప్పాడు. దీంతో వరలక్ష్మి శరత్ కుమార్ అంజలి ఇద్దరు సంతోషం వ్యక్తం చేశారు.ఏది ఏమైనప్పటికీ  తెర వెనుక మాట్లాడుకోవాల్సిన ముచ్చట్లను అందరి ముందే మాట్లాడి నిర్మాత పరువు తీశారు ఈ ఇద్దరు హీరోయిన్లు.ప్రస్తుతం నెట్టింట్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇక మదగదరాజా మూవీ తమిళంలో లాగే తెలుగులో కూడా హిట్ అయితే ఈ సినిమా కొత్త రికార్డు క్రియేట్ చేస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: